• November 16, 2021

Bigg Boss 5 Telugu : ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్న జెస్సీ.. కావాలనే బిగ్ బాస్ బయటకు పంపించేశాడా?

Bigg Boss 5 Telugu : ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్న జెస్సీ.. కావాలనే బిగ్ బాస్ బయటకు పంపించేశాడా?

    బిగ్ బాస్ ఇంట్లో పదోవారం నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ వింతగా జరిగిపోయింది. పదోవారం నామినేషన్లోకి రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి వచ్చారు. ఈ ఐదుగురిలోంచి ఎవరు బయటకు వెళ్లినా ఆటలోని మజా తగ్గుతుంది. ఆ విషయం బిగ్ బాస్ టీంకు కూడా తెలుసు. అందుకే ఏం చేయాలా? అని తెగ ఆలోచించినట్టుంది. మొత్తానికి వారికి ఓ బలి పశువులా జెస్సీ దొరికాడు. ఆరోగ్యం బాగా లేదన్న నెపంతో అతడిని బయటకు పంపించేశారు.

    జెస్సీ బయటకు రావాలని ఏమీ కోరుకోలేదు. కానీ ఎవరినో ఒకరిని పంపించాలి.. అందుకే జెస్సీ అనారోగ్యం అనే సాకు చెప్పి పంపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే జెస్సీ నిజంగానే అంత సీరియస్ ప్రాబ్లమ్ అయితే బయటకు వచ్చాక అలా రచ్చ రచ్చ చేయడు. మిడ్ నైట్ పార్టీలంటూ హడావిడి చేయడు. వెల్కమ్ పార్టీలంటూ నానా హంగామా చేస్తున్నాడు. నిజంగానే అంత సీరియస్ ఉంటే సరాసరి హాస్పిటల్‌కు వెళ్తాడు. చికిత్స తీసుకుంటాడు. కానీ ఇప్పుడు జెస్సీ.. అషూ, రాహుల్, అలీ రెజా ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో కనిపించాడు.

    ఒక వేళ నిజంగానే ఆరోగ్యం బాగా లేకపోతే ఇలా చేస్తాడు? చికిత్స తీసుకుంటాడు కానీ ఇలా పార్టీలంటూ తిరగడు కదా? అని నెటిజన్లలో అనుమానం మొదలైంది. అయితే వీటికి ఎవరు సమాధానం చెప్పగలరు? బిగ్ బాస్ కావాలనే జెస్సీని బయటకు పంపించాడా? లేదా? నిజంగానే జెస్సీకి అక్కడ ఉండలేని పరిస్థితులు ఎదురయ్యాయా? జెస్సీ తన ఇష్టం మేరకు బయటకు వచ్చాడా? బిగ్ బాస్ టీం ప్లాన్ ప్రకారం అలా బయటకు పంపించిందా? అన్నవి చిక్కు ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇక ఈ పదకొండో వారంలో అయితే ప్రియాంక, ఆనీ మాస్టర్‌లలో ఎవరో ఒకరు బయటకు వెళ్తారు. అది అందరికీ తెలిసిందే.

    Leave a Reply