- November 28, 2021
Deepthi Sunaina-Shanmukh Jaswanth : దీప్తి సునయన హింట్ ఇచ్చేసింది!.. షన్ను స్థానం అదేనా?

Deepthi Sunaina-Shanmukh Jaswanth బిగ్ బాస్ ఇంట్లో హింట్లు ఇవ్వడం అనేది మోస్తరుగా జరుగుతుంటుంది. గత సీజన్‌లో మెహబూబ్ ఇచ్చిన హింట్ వల్లే సోహెల్‌కు 25 లక్షలు వచ్చాయి. రెండు, మూడు అంటూ చేతి వేళ్లతో సైగలు చేశాడు మెహబూబ్. అది తెలుసుకుని సోహెల్ జాగ్రత్త పడ్డారు. కానీ బయటకు మాత్రం వేరేలా చెబుతుంటారు. అవి ఇన స్టాగ్రాం ఫాలోవర్ల సంఖ్య గురించి అని.. వాటి గురించే మాట్లాడుకున్నామని అంటారు.
కానీ పక్కా స్కెచ్. ముందే తనకు అభిజిత్ గెలుస్తాడని తెలుసు. అందుకే సోహెల్ మూసుకుని 25 లక్షలు వేసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు కూడా దీప్తి సునయన ఏదైనా హింట్ ఇచ్చిందా? అనే డౌట్ అందరికీ వస్తోంది. దీప్తి సునయన మైక్ పట్టుకుని విధానం, అందులో రెండు వేళ్లతో పట్టుకుంది. పైగా దాని కంటే ముందు రెండు వేళ్లతో పట్టుకుని ఇక్కడ చూడు అన్నట్టుగా. ఇంకో వేలిని పదే పదే ఆడించింది.
అది షన్నుకి అర్థమైందా? లేదా? అన్నది వేరే విషయం. నిజంగానే దీప్తి సునయన హింట్ ఇచ్చిందా? అనేది మాత్రం ఆమెకే తెలియాలి. కానీ షన్ను మాత్రం అనూహ్యంగా రెండో స్థానంలోకి వచ్చేశాడు. సన్నీ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే గనుక కంటిన్యూ అయితే సన్నీ అవలీలగా ట్రోఫీని పట్టేస్తాడు. సన్నీ బిగ్ బాస్ ఐదో సీజన్‌గా విన్నర్ అయ్యే చాన్సులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కానీ రానున్న రోజుల్లో మాత్రం సన్నీ, షన్ను, శ్రీరామచంద్ర, మానస్ మధ్య మంచి పోటీ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక రవి ఎలిమినేషన్ అనేది చాలా దారుణమని, అది సరైన నిర్ణయం కాదని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరూ అభిప్రాయ పడుతున్నారు.