• November 10, 2021

అప్పటి వరకు ఆ పని చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాం.. షన్నుపై దీప్తి సునయన కామెంట్స్

అప్పటి వరకు ఆ పని చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాం.. షన్నుపై దీప్తి సునయన కామెంట్స్

    దీప్తి సునయన, షణ్ముఖ్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. నిబ్బ బ్యాచ్ అంటూ జనాలు ట్రోల్ చేసినా కూడా ఈ ఇద్దరూ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇద్దరి జీవితాల్లోని గతంలో బ్రేకప్‌లు జరిగాయి. ప్రేమ విషాదం నుంచి బయటకు వచ్చారు. ఈ ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు పడ్డారు. బిగ్ బాస్ రెండో సీజన్ ద్వారా దీప్తి సునయన షణ్ముఖ్ లవ్ స్టోరీ ఎక్కువగా వైరల్ అయింది. ఆ సమయంలో షన్ను అంటూ తన ప్రేమ గురించి దీప్తి సునయన బిగ్ బాస్ ఇంట్లో చెప్పింది.

    ఇక ఇప్పుడు షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగాడు. వెబ్ సిరీస్‌లతో షన్ను చిన్నపాటి హీరోగా మారిపోయాడు. ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పరువు మొత్తం పోయింది. ఇక ఇప్పుడు షన్ను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు. బయటకు షన్ను గురించి దీప్తి సునయన చెబుతుంటే.. లోపల దీప్తి గురించి షన్ను చెబుతుంటాడు. అలా షన్ను, దీప్తిలు ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నారు. తాజాగా దీప్తి సునయన తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది.

    అందులో ఓ నెటిజన్ వింత ప్రశ్నను సంధించాడు. నువ్ షన్నుని సోషల్ మీడియాలో ఎందుకు ఫాలో అవ్వడం లేదు అని అడిగేశాడు. దీనికి దీప్తి సునయన వివరణ ఇచ్చింది. అప్పటి వరకు మేం ఇద్దరం ఒకరినొకరు ఫాలో అవ్వొద్దని ఫిక్స్ అయ్యాం.. ఇక ఈ ప్రశ్నను అడక్కండి అని దీప్తి సునయన చెప్పింది. కానీ ఎప్పటి వరకు? ఏది జరిగే వరకు అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యే వరకు ఇలా ఫాలో అవ్వకూడదని ఫిక్స్ అయ్యారేమో.

    ఇక నెటిజన్లు షన్ను ఆట గురించి ప్రశ్నలు విసిరారు. షన్ను స్టోరీలు ఎందుకు పెట్టడం లేదు? అని అడిగారు. ఈ వారం షన్ను నామినేషన్లో లేడు కాబట్టి.. ఈ వారం రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పింది. షన్ను కాకుండా ఇంకెవరంటే మీకు ఇష్టం బిగ్ బాస్ ఇంట్లో అని అడిగారు. కేవలం షన్నునే ఇష్టం.. షన్ను మాత్రమే ఇష్టమన్నట్టుగా చెప్పింది దీప్తి.

     

    Leave a Reply