• December 26, 2021

Shanmukh Jaswanth : ఇక నుంచి ఏం చేయాలో నాకు తెలుసు.. బిగ్ బాస్ రన్నర్ షన్ను

Shanmukh Jaswanth : ఇక నుంచి ఏం చేయాలో నాకు తెలుసు.. బిగ్ బాస్ రన్నర్ షన్ను

    Shanmukh Jaswanth బిగ్ బాస్ షో ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ బోలెడంత నెగెటివిటీని మూట గట్టుకున్నాడు. అసలైతే షన్నుకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌లో బిగ్ బాస్ విజేతగా నిలవాల్సింది. కానీ షన్ను స్వయంకృతాపరాధంతోనే ఇంత వరకు తెచ్చుకున్నాడు. చివరకు సన్నీ చేతిలో ఓడిపోయాడు. బిగ్ బాస్ విజేతగా కాకుండా రన్నర్‌గా సరిపెట్టుకున్నాడు. మొత్తానికి బయటకు వచ్చాక షన్ను పద్దతిలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే అదీ లేదు.

    షన్ను, దీప్తి సునయన కలుసుకున్నట్టు ఇంత వరకు ఎక్కడా కూడా ఓ ఫోటో రాలేదు. ఇక మరో వైపు శ్రీహాన్, సిరి కలుసుకున్నట్టుగా కూడా అనిపించడం లేదు. కానీ జెస్సీ, షన్ను, సిరి మాత్రం కలిసి దుమ్ములేపుతున్నారు. ఇంకా బిగ్ బాస్ హ్యాంగవుట్‌లోనే ఉన్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ షో మాత్రం ఎన్నో నేర్పించినట్టుంది. తాజాగా షన్ను చేసిన కామెంట్లే దానికి ఉదాహరణ.

    శనివారం నాడు షన్ను తన ఫ్యాన్స్‌తో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ మీటింగ్‌లో షన్ను సందడి చేశాడు. తన అభిమానుల ప్రేమకు ఫిదా అయ్యాడు. అరే ఏంట్రా ఇది అంటూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. అయితే షన్ను తన ఫ్యాన్స్‌కి ఓ మాటిచ్చాడు. వారు వేసిన ఓట్లకు విలువ ఉంటుందని అన్నాడు.

    వైజాగ్ ప్రజలారా.. మీరు నాకు ఫ్యాన్స్ కాదు.. నేను మీ అందరికీ ఫ్యాన్.. మీరు ఇంత కష్టపడి ఓట్లు వేశారు.. మీ ఓట్లు ఎక్కడికి పోవు.. ఇప్పటి నుంచి ఏం చేయాలో.. ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుసు.. మీ అందరినీ గర్వపడేలా చేస్తాను.. బిగ్ బాస్‌షోకి వచ్చిన 19 మంది ఎంతో కష్టపడ్డదారు. అందరికీ సపోర్ట్ చేయండి. అరేయ్ ఏంట్రీ ఇది అని షన్ను పోస్ట్ చేశాడు.

    Leave a Reply