• December 18, 2021

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ విన్నర్ సన్నీ!.. ఇదొక చరిత్ర అవుతుందా?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ విన్నర్ సన్నీ!.. ఇదొక చరిత్ర అవుతుందా?

    VJ Sunny Shanmukh Jaswanth బిగ్ బాస్ ఐదో సీజన్ నయా హిస్టరీ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేని ఓ కంటెస్టెంట్.. ఆల్రెడీ స్టార్ అయిన కంటెస్టెంట్‌తో పోటీ పడ్డాడు. వీజే సన్నీపై మొదట్లో ఎవ్వరికీ అంచనాలు లేవు.. ఓ సెలెబ్రిటీ అయినా కూడా అంతగా ఎవ్వరికీ తెలియదు. కానీ అవతల యూట్యూబ్ స్టార్ ఉన్నాడు. షణ్ముఖ్ జశ్వంత్ ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని మొదట్లో అంతా అనుకున్నారు.

    ఎందుకంటే అతని యూట్యూబ్ చానెల్, సోషల్ మీడియా ఖాతాలకు మిలియన్ల ఫాలోవర్లున్నారు. అలా అతని ఫాలోవర్లు ఓట్ల దెబ్బకు మిగతా ఎవ్వరూ నిలవలేరు అని అంతా అనుకున్నారు. కానీ తెరపై వేరు.. బిగ్ బాస్ షోలో వేరు.. నటించడం వేరు.. తమ వ్యక్తిత్వంతో జీవించడం వేరు అన్నది మరోసారి నిరూపించింది. ఎవరైతే జనాల హృదయాలను గెలుచుకుంటారో వారే గెలుస్తారు.

    అయితే ఈ ఐదో సీజన్‌లో సన్నీ గెలుస్తాడని ఇప్పటికే అనధికారిక పోల్స్ చెబుతున్నాయి. అన్ని ప్రైవేట్ సర్వేలు, మీడియా, సోషల్ మీడియాలో పెట్టిన పోల్స్‌లో దాదాపు సన్నీనే టాప్‌లో ఉన్నాడు. అలా సన్నీ విజేత అవుతాడని అంతా ఫిక్స్ అయ్యారు. దాదాపు ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ఒక వేళ చివరి నిమిషంలో బిగ్ బాస్ టీం మనసు మార్చుకుంటుందో ఏమో చెప్పలేం.

    మొత్తానికి ఇప్పుడు అయితే సన్నీ టాప్‌లో ఉండగా.. షన్ను రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మూడో స్థానంలో శ్రీరామచంద్ర ఉన్నాడని తెలుస్తోంది. మానస్ నాలుగో స్థానంలో ఫిక్స్ అయ్యాడట. ఇక చివరన సిరి ఉందని సమాచారం. మొత్తానికి సన్నీ గెలిస్తే మాత్రం అది నిజంగా ఓ హిస్టరీ అవుతుంది.

    Leave a Reply