• November 12, 2021

Bigg Boss 5 Telugu : నీకేంట్రా మర్యాద ఇచ్చేది.. షన్నుపై ఊగిపోయిన సన్నీ

Bigg Boss 5 Telugu : నీకేంట్రా మర్యాద ఇచ్చేది.. షన్నుపై ఊగిపోయిన సన్నీ

    బిగ్ బాస్ ఇంట్లో ఆవేశం స్టార్‌గా మారిపోయాడు సన్నీ. ఆత్రం స్టార్‌గా కాజల్ నిలిచింది. అయితే సన్నీకి నాగార్జున కాస్త క్లాస్ పీకిన తరువాత శాంతించాడు. ఓ రెండు వారాలు ఎవ్వరి మీదకు వెళ్లలేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం రెచ్చిపోయాడు. బిగ్ బాస్ పదో వారంలో బీబీ హోటల్ టాస్క్ ఇచ్చాడు.అందులోంచి కెప్టెన్సీ కంటెండెర్స్‌గా ఓ నలుగురు ఎంపికైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ కెప్టెన్సీ కంటెండెర్స్ టాస్క్‌లో మళ్లీ గొడవ మొదలైంది.

    నలుగురు కంటెస్టెంట్లకు టవర్‌లో ఉంది పవర్ అనే టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. హోటల్ సిబ్బంది గెలవడంతో వారి టీంలోంచి కెప్టెన్ పోటీ దారులయ్యారు. షన్ను, మానస్, రవి, ఆనీలు కెప్టెన్ పోటీ దారులుగా మారినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఆటలో సన్నీ, షన్ను, సిరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొడితే అప్పడం అవుతావ్ అని సిరి మీదకు వచ్చాడు సన్నీ. అప్పడం అయితే అవి నువ్వే అమ్ముకో అంటూ సిరి సెటైర్లు వేసింది. సిరి, సన్నీల మధ్యకు షన్ను వచ్చాడు.

    అప్పడం ఏంటి అంటూ మధ్యలోకి వచ్చిన షన్ను మీద సన్నీ అరిచేశాడు. నువ్ మధ్యలోకి రాకంటూ షన్ను మీద అరిచేశాడు సన్నీ. వస్తాను అంటూ షన్ను కూడా రెచ్చిపోయాడు. అప్పడం అంటే వస్తాను.. ఆ మాటలేంటి? అని షన్ను రివర్స్ ఫైర్ అయ్యాడు. రేయ్.. అంటూ సన్నీ నోరు పారేసుకున్నాడు. మర్యాదగా మాట్లాడు అంటూ షన్ను అన్నాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది అంటూ హద్దులు దాటేశాడు సన్నీ. కొడతావా? కొట్టు, ఎవరిని అప్పడం చేస్తావ్ చేసి చూపించి అని షన్ను ఫైర్ అయ్యాడు. మొత్తానికి సన్నీకి ఈ వారం కోటింగ్ ఉండేట్టు కనిపిస్తోంది.

    ఆడపిల్లను తంతాను.. అప్పడం చేస్తా అంటూ నోరు పారేసుకున్నాడు సన్నీ. ఇక షన్నుని రా, ఏంట్రా అంటూ దారుణంగా కించపరిచాడు. మొత్తానికి సన్నీ మాత్రం తన టెంపర్ కోల్పోయాడు. ఇలా రెచ్చిపోయాడు. నాగ్ ఇక అక్షింతలు వేయడమే బ్యాలెన్స్ అన్నట్టుంది.

     

    Leave a Reply