• November 27, 2021

మాటలు మార్చేయడంలో దిట్ట!.. కాజల్ మామూల్ది కాదు

మాటలు మార్చేయడంలో దిట్ట!.. కాజల్ మామూల్ది కాదు

    కాజల్ మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అవతలి వాళ్లను కావాలనే రెచ్చగొట్టినట్టు, ఉసిగొల్పినట్టు అనిపిస్తుంది. కానీ పైకి మాత్రం అలా ఏమీ ఉండదు. మాటలు మార్చడం, ఫిట్టింగ్‌లు పెట్టడంతో కాజల్ దిట్టా. తాజాగా ఫ్యామిలీ మెంబర్లు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. తన భర్త్ విజయ్ రావడంతో కాజల్ ఫుల్ ఖుషీ అయింది. బాగా ఆడుతున్నావ్ అని భర్త చెప్పిన దాని కంటే ఎక్కువగా శ్రీరామచంద్ర, రవిలపై చేసిన కామెంట్లకే ఎక్కువగా సంతోషపడుతోంది.

    ఒక్కొక్కళ్లు వెళ్లిపోతుంటే నీకు ఎలా అనిపిస్తోంది అని కాజల్ భర్త శ్రీరామచంద్రను అడుగుతాడు. పెరుగుతూనే వెళ్లిపోతూనే ఉన్నారు అని శ్రీరామచంద్ర అంటాడు. నువ్ ఆపాలి బ్రో వెళ్లకుండా అని ఎంతో క్యాజువల్‌గా అన్నాడు. కానీ మన కాజల్ మాత్రం వాటిని రకరకాలు ట్విస్ట్ చేసి పదే పదే సన్నీ, మానస్ ముందు చెప్పేసింది. మీ ఫ్రెండ్స్ వెళ్లిపోతుంటే కాపాడుకోవాలి కదా? అని అన్నాడట.

    తన భర్త అననని మాటలను కూడా అనేసినట్టు భలే ట్విస్ట్ చేసింది. ఆపాలి బ్రో అని కాపాడుకోవాలి కదా? అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది కాజల్. అయితే ఇదే విషయాన్ని పదే పదే కాజల్ అనడంతో సన్నీకి విసుగొచ్చింది. ఎందుకు పదే పదే రిపీట్ చేస్తావ్ నాకు నచ్చలేదంటూ కాజల్ మీద అరిచేశాడు. కనీసం సన్నీకి ఉన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా కాజల్ లేకుండా పోయింది.

    Leave a Reply