- December 11, 2021
Bigg Boss 5 Telugu : కాజల్ అవుట్.. ఇంత సందడి, సంబరాలు ఎప్పుడూ చూడలే!

బిగ్ బాస్ ఇంటి నుంచి కొందరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెళ్తుంటే ఆడియెన్స్ బాధపడతారు. ఇంకొంత మంది కంటెస్టెంట్లు వెళ్తుంటే మాత్రం.. పీడపోయింది, ఇన్ని రోజులు ఉండటమే ఎక్కువ అని అనుకుంటారు. అలా ఈ రెండో కేటగిరీకి చెందిన కంటెస్టెంట్లలో ఆర్జే కాజల్ ఉంటుంది. మోస్ట్ హెట్రెడ్ కంటెస్టెంట్‌గా కాజల్ పేరు ఎక్కువగా నెట్టింట్లో వినిపించింది.
కాజల్ మీద వచ్చిన నెగెటివిటీ అంతా ఇంతా కాదు. గతంలో భాను శ్రీ, తేజస్వీ, శ్రీముఖి వంటి వాళ్లకంటే కూడా ఎక్కువగా కాజల్ మీద నెగెటివిటీ వచ్చింది. ఆమె ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడూ కూడా పుల్లలు పెడుతూ, తన వెకిలి చేష్టలతో అందరినీ విసిగించేది. తాను బిగ్ బాస్ షోను గ్రౌండర్‌లో వేసి మిక్స్ చేసి మింగేసి వచ్చినట్టు ఫీలవుతుంది.
ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తే పుటేజ్ ఎక్కువగా వస్తుందనే విషయం బాగా తెలుసు. అందుకే ఆత్రం, అతి అంటూ ఆమెకు ఇచ్చిన ట్యాగులు సరిగ్గా సరిపోయాయి. ఇక నాగిని అనే పేరు మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అయితే కాజల్ ఎలిమినేషన్ ఎప్పుడో జరగాల్సింది. జెస్సీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ వారం కాజల్ సేఫ్ అయింది. జెస్సీ బయటకు వచ్చేశాడు.
మానస్, సన్నీలతో ఫ్రెండ్ షిప్ కూడా స్ట్రాటజీలో భాగమేనని కొందరు అంటుంటారు. ఆమె కావాలనే వారితో స్నేహం చేస్తుంది, వారి ఓట్లు కూడా కాజల్‌కు పడుతుంటాయని, అదే ఆలోచనలతో వారితో కలిసిపోయిందని నెటిజన్లు ఆరోపిస్తుంటారు. మొత్తానికి కాజల్ మాత్రం బిగ్ బాస్ ఇంటిని వీడిపోయే సమయం వచ్చింది.
కాజల్ ఎలిమినేట్ అయినందుకు ఏ ఒక్కరూ కూడా బాధ పడినట్టు కనిపించడం లేదు. ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో కాజల్ మీద సెటైర్లు వేస్తున్నారు. కాజల్ ఎలిమినేట్ అయిందా? అబ్బా సాయి రాం.. పీడ పోయింది అంటూ మీమ్స్‌తో దుమ్ములేపుతున్నారు. మొత్తానికి కాజల్ తన ఇమేజ్‌ను చూసి ఎలాంటి స్థితిలోకి వెళ్తుందో చూడాలి.