• November 27, 2021

Bigg Boss 5 Telugu: ఇది కచ్చితంగా షాక్.. బిగ్ బాస్ షో ఏంటో అర్థం కాదు! రవిని బలి చేశారా?

Bigg Boss 5 Telugu: ఇది కచ్చితంగా షాక్.. బిగ్ బాస్ షో ఏంటో అర్థం కాదు! రవిని బలి చేశారా?

    Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో మొదటి సారి అంచనాలను తలకిందులయ్యాయి. ఎందుకంటే మొదటిసారిగా ఓటింగ్ మీదే అందరికీ అనుమానం వచ్చేలా షో నడుస్తోంది. ఈ పన్నెండో వారంలో ఏం జరిగిందో. ఏమో అర్థం కాలేదు. ఈ వారం అందరికీ నిజంగానే షాక్ తగిలింది. ఎందుకంటే బయట ఎక్కడా ఏ పోల్ చూసినా కూడా కాజల్, మానస్, సిరి ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నారు.

    కానీ తాజాగా వినిపిస్తున్న లీకుల సమాచారం మేరకు రవి ఎలిమినేట్ అయినట్టు కనిపిస్తోంది. యాంకర్ రవి అలా ఎలా ఎలిమినేట్ అవుతాడు.. టాప్ 5 కంటెస్టెంట్.. విన్నింగ్ చాన్స్ కూడా ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ కదా? అలా ఎలా బయటకు వస్తాడు అంటూ జనాలు అంతా షాక్ అవుతున్నారు. అందుకే ఇది బిగ్ బాస్ షో అని అంటారామో.

    ఊహించింది జరిగితే అది ఆట ఎందుకు అవుతుంది.. అందుకే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చినట్టున్నాడు. కావాలనే రవిని బయటకు పంపినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లను వరుసగా పంపించడం ఎందుకు అని భావించినట్టున్నాడు. అందుకే ప్రియాంక, సిరిలను కాపాడేందుకు రవిని బలి పశువును చేసినట్టున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రవి ఎలిమినేషన్‌ను ఎవ్వరూ నమ్మడం లేదు.

    Leave a Reply