• November 15, 2021

Bigg Boss 5 Telugu : నామినేషన్ లిస్ట్ ఇదే.. ప్రియాంకకు మూడనుందా?

Bigg Boss 5 Telugu : నామినేషన్ లిస్ట్ ఇదే.. ప్రియాంకకు మూడనుందా?

    బిగ్ బాస్ ఇంట్లో పది వారాలు గడిచాయి. పది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. నిన్న జెస్సీ అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. అలా మొత్తానికి సరయు, ఉమా దేవీ, హమీద, లహరి, నటరాజ్ మాస్టర్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ, ఇలా తొమ్మది మందిని ప్రేక్షకులు బయటకు పంపిస్తే.. జెస్సీని బిగ్ బాస్ పంపించేశాడు. ఇక పదకొండో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసినట్టు లీకులు వస్తున్నాయి. ఒకరి ఒకరు పడి పోట్లాడుకున్నంత పని అయిందట.

    ఈ పదకొండో వారంలో దాదాపు అందరూ నామినేషన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. కెప్టెన్ రవి మాత్రం తప్పించుకున్నాడు. ఇందులో ఓ గమ్మత్తైన అంశం జరిగిందట. శ్రీరాచంద్రను ఒక్కరే నామినేట్ చేశారట.. ఒక్క ఓటే వచ్చిందట. అయినా కూడా నామినేషన్లోకి వచ్చేశాడట. మిగిలిన వారందరికీ కనీసం రెండేసి ఓట్లు పడ్డాయట. కానీ బిగ్ బాస్ మాత్రం అందరినీ నామినేట్ చేసి పడేశాడట. అంటే ఆనీ మాస్టర్, ప్రియాంక, కాజల్, మానస్, సన్నీ, షన్ను, సిరి ఇలా అందరూ నామినేషన్లోకి వచ్చారు.

    ఇక ఈ పదకొండో వారంలో ప్రియాంక, ఆనీ మాస్టర్‌లు డేంజర్ జోన్‌లో ఉంటారు. ఈ ఇద్దరిలోనూ ఎక్కువగా అంటే ప్రియాంక బార్డర్ మీదుంది. ఆమె ఇంట్లో ఉండి కూడా చేసేది ఏమీ లేదనే భావన ప్రేక్షకుల్లో వచ్చేసింది. మానస్ మీద పడటం, ముద్దులు పెట్టడం, అమ్మకుచ్చి..చుచు అని ముద్దులు పెట్టడం తప్పా చేసేదేమీ లేదని అందరికీ అర్థమైంది. దీంతో ఈ సారి ప్రియాంక ఎలిమినేట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

    Leave a Reply