- November 24, 2021
Bigg Boss 5 Telugu : మేం అంతా కలిసిపోతాం మీరే ఇలా మిగిలిపోతారు!.. ట్రోలింగ్‌పై ఆనీ మాస్టర్

Bigg Boss 5 Telugu ఆనీ మాస్టర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చాక అసలు సంగతి తెలుస్తుంది. ఏ కంటెస్టెంట్‌కు ఎలాంటి ఇమేజ్ వచ్చింది.. ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అయింది.. తాను ఎలా కనిపించాను.. తన మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందనే మ్యాటర్ తెలుస్తుంది. అలా ఆనీ మాస్టర్ తన మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్ చూసుకున్నట్టుంది. తనకు వచ్చిన ఇమేజ్ చూసి ఒకింత షాకై నవ్వుకున్నట్టు అనిపిస్తోంది.
కాజల్, సన్నీ, మానస్ అభిమానులు ఆనీ మాస్టర్‌ను ట్రోల్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆనీ మాస్టర్ ఈ ట్రోలింగ్, మీమ్స్‌లసై స్పందించింది. కంటెస్టెంట్లంతా ఒక్కటే అవుతారు.. చివరకు మీరే ఇలా కొట్టుకుని చస్తారు అన్నట్టుగా ఆనీ మాస్టర్ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది. ట్రోలర్స్, మీమర్స్‌కు థ్యాంక్స్. నాకంటూ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అని నవ్వేసింది. నేనేంటో నాకు తెలుసు.. లోపల ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది.
చివరకు బిగ్ బాస్ ఇంట్లో అందరూ ఒక్కటే అవుతారు. టాస్కులు, నామినేషన్ల వరకే గొడవలు ఉంటాయి. అందుకే మీరెవ్వరూ గొడవపడకండి.. ట్రోలింగ్, ద్వేష పూరితమైన సందేశాలను పంపించకండి.. బిగ్ బాస్ తరువాత మేం అంతా కలిసి పార్టీలు చేసుకుంటాం. మీరు మాత్రం ఇలానే ఉంటారు. అందుకే చిల్ అవ్వండి.. మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి అని చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ ఇంట్లో ఆనీ లేకపోయినా కూడా గొడవలు మాత్రం ఆమె గురించే జరుగుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ మొత్తం ఆమె గురించే జరిగింది. శ్రీరామచంద్ర మాట్లాడిన మాటలు, లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఆనీ మాస్టర్ విషయంలో చోటు చేసుకున్నవే.