- January 5, 2022
Bigg Boss 5 Telugu : మీమర్స్, ట్రోలర్స్‌కు శాపనార్థాలు!.. ఆ డబ్బు అంటూ ఆనీ మాస్టర్ ఫైర్

Anee Master ఆనీ మాస్టర్ బిగ్ బాస్ షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కో సారి ఆనీ మాస్టర్ అరుపులు, చేష్టలకు జనాలు చిర్రెత్తిపోయారు. ఆనీ మాస్టర్ యాక్షన్లకు అందరూ నవ్వుకునే వారు. ఇక ఆమె తెలుగు మాటలు, పదాల వాడకంపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీకావు. ఆనీ మాస్టర్‌ను మీమర్స్ తెగ వాడేశారు. అయితే ఆనీ మాస్టర్ చెప్పే మాటలకు, చేసే చేష్టలకు అస్సలు పొంతనే ఉండేది కాదు.
ఒంటరిగా ఆడుతాను అని చెప్పేది. కానీ శ్రీరామచంద్ర, రవితో మాత్రం రిలేషన్ పెంచేసుకుంది. తమ్ముడు అంటూ వాళ్లతోనే ఉండేది. కలిసి టాస్కులు కూడా ఆడేవారు. కానీ మిగతా వాళ్లను మాత్రం గ్రూపు, చెంచాలు అని అంటూ ఉండేది. మొత్తానికి ఆనీ మాస్టర్ మాత్రం ఉండాల్సిన సమయం కంటే ఎక్కువగానే ఇంట్లోఉంది.
తాజాగా ఆనీ మాస్టర్ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆనీ మాస్టర్ సమాధానం ఇచ్చింది. ఇందులో చాలా మంది బిగ్ బాస్ షో గురించి ప్రశ్నలు సంధించారు. తనపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ గురించి ఎలా ఫీలయ్యారు అంటూ ఆనీ మాస్టర్‌ను నెటిజన్లు అడిగారు.
కొంచెం మనీ షేర్ చేస్తే అయిపోతదిగా.. మస్త్ సంపాదించారు నా మీద కామెడీ చేసుకుంట.. ఏం చేశారో.. అలాంటి మనీతో.. మోషన్స్ అవ్వాలి వాళ్లకి అంటూ శాపనార్థాలు పెట్టేసింది ఆనీ మాస్టర్. మొత్తానికి ఆనీ మాస్టర్ మాత్రం తన మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.