• November 29, 2021

Bigg Boss 5 Telugu : ఓట్లు తక్కువొచ్చాయంటే నేను నమ్మను : యాంకర్ రవి

Bigg Boss 5 Telugu : ఓట్లు తక్కువొచ్చాయంటే నేను నమ్మను : యాంకర్ రవి

    Anchor Ravi యాంకర్ రవి.. కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు.. విన్నర్ అవుతాడని మొదట్లో అంతా ఊహించారు. అయితే రవి ఆడే అబద్దాలు, అందరినీ ప్రభావితం చేయడం వంటి కారణాలతో కాస్త నెగెటివిటీ వచ్చింది. అయినా కూడా రవి ఇమేజ్ దృష్ట్యా టాప్ 5 వరకు ఉంటాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అలాంటి ఇలా ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. కంటెస్టెంట్లు కూడా ఒకింత షాక్ అయ్యారు. తాను వెళ్లిపోతాను ఎలిమినేట్ అవుతాను అని పక్కాగా అనుకోవడంతో కాజల్ వెక్కి వెక్కి ఏడ్చేసింది.

    కానీ చివరకు రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కానీ మిగతా కంటెస్టెంట్లలా కన్నీళ్లు పెట్టుకోలేదు. సింపతీ కార్డ్ కోసం ట్రై చేయలేదు. అయితే రవి బయటకు వచ్చాక తన అనుమానాలన్నీ వెల్లిబుచ్చాడు. ఇలా ఎలిమినేట్ అయి బయటకు వస్తాను అని అనుకోలేదు.. అక్కడే ఆట ఆడేది ఇద్దరు ముగ్గురు అందులో నేను ఉంటాను.. నేను ఇలా ఎలిమినేట్ అవ్వడం నమ్మలేకపోతోన్నాను అని రవి అన్నాడు.

    తక్కువ ఓట్లు వచ్చాయంటే.. నేను నమ్మను.. అసలేం జరిగిందో చూడాలి.. అనలైజ్ చేయాలి.. బయటకు ఏం వచ్చిందో నాకు తెలీదు.. అది చూడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా.. ఈ ఎలిమినేషన్‌తో నాకు గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది.. బయటకు వచ్చాక ఈ జనాల ప్రేమ చూస్తుంటే.. నాకు ఇప్పుడు అర్థమవుతోంది.. విన్నర్ వాళ్లెవరో చేయడం కాదు.. ఇప్పుడు మీరు విన్నర్ చేశారు అంటూ అభిమానులనుద్దేశించి మాట్లాడాడు.. భూమ్మీద ఉన్నంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను. పొరబాట్లను సరిదిద్దుకుంటాను అని రవి తెలిపాడు.

    Leave a Reply