• December 1, 2021

Bigg Boss 5 Telugu : జరిగేది వేరు చూపించేది వేరు.. బిగ్ బాస్ గుట్టు విప్పిన యాంకర్ రవి

Bigg Boss 5 Telugu : జరిగేది వేరు చూపించేది వేరు.. బిగ్ బాస్ గుట్టు విప్పిన యాంకర్ రవి

    బిగ్ బాస్ షో అంటే ఆషా మాషీ కాదు. అక్కడ జరిగేది వేరే ఉంటుంది.. బిగ్ బాస్ ఎడిటర్లు చూపించే విధానం వేరుగా ఉంటుంది. వారు ఎవరిని హైలెట్ చేయాలి. ఎవరిని తొక్కేయాలి.. ఎవరికి నెగెటివిటీ వచ్చేలా చేయాలనేది వారి చేతిలోనే ఉంటుంది. అలా 24 గంటలు జరిగిన దాంట్లో మనకు గంట మాత్రమే చూపిస్తారు. దాన్ని చూసి జనాలు ఓట్లు వేస్తుంటారు.

    యాంకర్ రవి తనకు జరిగిన ఎలిమినేషన్‌ను ఇంకా నమ్మలేకపోతోన్నాడట. ఓట్లు తక్కువగా వచ్చాయని అన్నారు.. కానీ బయట చూస్తే ప్రతీ ఒక్కరూ కూడా టాప్ 5లో ఉండాల్సిన వాడివి.. ఇలా ఎలా ఎలిమినేట్ అయ్యావ్.. అని అంటున్నారట. అసలేం జరిగిందో తనకు కూడా అర్థం కావడం లేదని అన్నాడు. ఇక బిగ్ బాస్ షో మీద కూడా ఆరోపణలు చేశాడు.

    అన్నీ చదివాను.. అన్నీ ట్రోల్స్ చూశాను.. నా ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా ఎదుటి వాళ్లను కించపరిచేలా మాటలు, ట్రోల్స్ చేయలేదు. కానీ కొందరు మాత్రం నా ఫ్యామిలీని తిట్టారు. నిత్యను అన్నారు. అక్కడి వరకు పర్లేదు. కానీ నా బిడ్డను కూడా అనేశారు. డబ్బులిస్తే వారి ఫ్యామిలీ గురించి కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ ట్రోలర్స్ మీద రవి విరుచుకుపడ్డారు.

    బిగ్ బాస్ ఇంట్లో జరిగేది వేరు.. చూపించేది వేరు. అవి నేను ఇప్పుడు చెబితే.. ఆ నిజాలు విని మీరే షాక్ అవుతారు.. అమ్మా అని అనుకుంటారు. కానీ అవేవీ నేను చెప్పను. ఎందుకంటే ఒకరిని కిందకు దించడం నాకు నచ్చదు.. నేను బయటకు వచ్చాను కాబట్టి లోపలి విషయాలు చెప్పలేను అంటూ యాంకర్ రవి తన ఎలిమినేషన్ గురించి, తన ఫ్యాన్స్ గురించి చెప్పుకొచ్చాడు.

    షో ఒకలా నడిస్తే.. బయట ట్రోలర్స్, పెయిడ్ టీం మరోలా నడిపోస్తందని యాంకర్ రవి అన్నాడు. బిగ్ బాస్ చూసి నిజంగా ఓట్లు వేసే వారు.. ఆటను మాత్రమే చూడండని, ట్రోల్స్ చూసి ఓట్లు వేయకండని రవి సూచించాడు.

    Leave a Reply