• November 17, 2021

కార్తీకదీపం భాగ్యంపై రేప్ బెదిరింపులు.. బిగ్ బాస్ షోపై మండిపడ్డ మాధవీలత

కార్తీకదీపం భాగ్యంపై రేప్ బెదిరింపులు.. బిగ్ బాస్ షోపై మండిపడ్డ మాధవీలత

    బిగ్ బాస్ ఇంట్లోని వ్యవహారాలు, కంటెస్టెంట్ల గొడవల వల్ల సోషల్ మీడియాలో జరిగే వివాదం అంతా ఇంతా కాదు. కంటెస్టెంట్ల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. కంటెస్టెంట్ల అభిమానులు ఓ దశ వరకు బాగానే ఉంటారు. కానీ ఒక్కోసారి హద్దులు దాటేస్తుంది. తమకు నచ్చిన కంటెస్టెంట్లు గురించి ఎదుటి వారు తేడాగా మాట్లాడినా, వారికి సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా రెచ్చిపోతోంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇప్పుడు ఫైట్ అంతా కూడా షన్ను వర్సెస్ సన్నీ ఫ్యాన్స్ మధ్యే జరుగుతోంది.

    ఈ క్రమంలో ఉమా దేవీపై షన్ను ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారట. మామూలుగానే ఆమె సన్నీకి మద్దతు ఇస్తుంటుంది. అయితే దీనిపై షన్ను అభిమానులు కాస్త హర్ట్ అయినట్టున్నారు. సన్నీ, మానస్‌లకే తన ఓటు, మద్దతు అని ఉమా దేవీ చెప్పడంపై షన్ను ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారట. రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట. ఈ ఘటనపై మాధవీలత స్పందించింది. ఉమా దేవీ, రోహిణిలకు పిచ్చి పిచ్చి మెసెజ్‌లు చేస్తున్నారు.. రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు.. చిల్లర గాళ్లు ఏమనుకుంటున్నార్రా? అని మండి పడింది.

    ‘నమస్తే అందరినీ ఉతికి సాకిరేవుపెట్టడానికి వచ్చాను. ఫ్యాన్స్ అనేవాడు గౌరవంతో మాట్లాడాలి. ఆడవాళ్ల మీద పడి బూతులు తిట్టకూడదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఉమాదేవికి రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ మెసెజ్‌లు పెడుతున్నారట. ఇప్పుడే నా నోటీస్‌కు వచ్చింది. ఇక రోహిణి కూడా తన యూట్యూబ్ చానెల్‌లో సన్నీకి సపోర్ట్‌గా మెసెజ్ పెడితే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారట. ఏయ్ మేం సూపర్ స్టార్ ఫ్యాన్స్.. మా జోలికి వస్తే రేప్ చేసి పడేస్తాం..మా జోలికి వస్తే అది చేస్తాం.. ఇదేనా? కల్చర్..

    ఏ మొహాలు పెట్టుకుని ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. మీ స్టార్స్ ఎంత నీచంగా ఉంటే మీరు ఇంత నీచంగా ఉన్నారో అని మేం అనాల్సి వస్తుంది. కల్చర్డ్ హీరోస్, నటులు ఉంటే వారి ఫ్యాన్స్ కూడా అలానే ఉంటారు. అంతే కానీ ఇలా చిల్లర వేషాలు ఏంటి? విమర్శించాలంటే దానికి ఓ పద్దతి ఉంటుంది. మీ ఆరోపణలు మాకు నచ్చలేదు.. మా వాళ్లు చేసిన తప్పేంటి? అని అడగాలి.. అంతే కానీ చిల్లర భాషను వాడకూడదు.’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. ఇక మరో పోస్ట్‌లో బిగ్ బాస్ షో సైకో షో అనాగరికపు షో అంటూ మండిపడింది.

    Leave a Reply