- October 18, 2021
Bigg Boss : ఏడో వారం నామినేషన్ లిస్ట్ మామూలుగా లేదు!

Bigg Boss బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆరువారాలు సక్సెస్ ఫుల్‌గా గడిచాయి. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడు. మిగిలిన పన్నెండు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు. అందులోంచి ఈ ఏడో వారంలోకి నామినేట్ అయినవారి లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. నామినేషన్ ప్రాసెస్ అంటే బిగ్ బాస్ ఇంట్లో ఓ మినీ యుద్దమే. అలాంటిది సోమవారం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు.
నామినేషన్ ప్రాసెస్ ఏంటి? ఎవరు ఎవరిని నామినేట్ చేస్తున్నారు? ఎలాంటి కారణాలతో నామినేట్ చేస్తున్నారు అనే వాటిని చూస్తుంటారు. ఎప్పటిలానే చాలా మంది కంటెస్టెంట్లు సిల్లీ కారణాలతో నామినేషన్లు చేస్తుంటారు. అయితే ఈ వారం ఎవరు ఎలాంటి కారణాలు చెప్పి నామినేట్ చేస్తారో చూడాలి. ఏడో వారం నామినేషన్‌లో దాదాపు తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయినట్టు తెలుస్తోంది.
ఆనీ మాస్టర్, కాజల్, సిరి, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామచంద్ర, ప్రియాంక, లోబో ఈ ఏడో వారం నామినేషన్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సీక్రెట్ రూంలోకి వెళ్లాడు కాబట్టి చాలా అడ్వాంటేజ్‌లు ఉంటాయిని అందరూ లోబోను నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది.మరి వాటికి లోబో ఎలాంటి సమాధానాలు ఇస్తాడో చూడాలి. ఇక ఎప్పటిలానే ప్రియ నామినేషన్‌లోకి వచ్చింది. అయితే ఈ వారంలో ఎవరు ఇంటి నుంచి వెళ్తారో చూడాలి.