• July 14, 2023

Bharateeyans Review: భారతీయన్స్ రివ్యూ.. దేశభక్తిని చాటిచెప్పే చిత్రం

Bharateeyans  Review: భారతీయన్స్ రివ్యూ.. దేశభక్తిని చాటిచెప్పే చిత్రం

    Bharateeyans Review: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అన్ని రకాల జానర్లు ఆడేస్తున్నాయి. అయితే పేట్రియాట్రిక్ సినిమాలు ఎక్కువగా రావడం లేదు. రీసెంట్‌గా పఠాన్ అనే సినిమా వచ్చింది. కానీ అందులో ఎక్కువగా దేశ భక్తి గురించి ఉండదు. సరిహద్దు ప్రాంతాల సమస్యలు, సైనికుల పోరాటాలు, శత్రు దేశాల పన్నాగాల మీద వచ్చే సినిమాలు చాలా తక్కువ. ఆ పాయింట్లతో భారతీయన్స్ అనే సినిమాను శంకర్ నాయుడు నిర్మించగా.. ధీన రాజ్ తెరకెక్కించాడు. ఈ సినిమా రివ్యూని ఓ సారి చూద్దాం.

    కథ
    భారతీయన్స్ కథలో భోజ్ పురి, తెలుగు, నేపాలి, బెంగాలి, త్రిపుర, పంజాబీ అంటూ ఓ ఆరు కారెక్టర్లుంటాయి. వీళ్లంతా రకరకాల నేపథ్యాల నుంచి వస్తారు. అయితే ఈ అందరూ మర్డర్లు చేయడమే అనేది కామన్ పాయింట్. వాటి వెనుకాల కూడా విభిన్న కారణాలుంటాయి. అయితే వీళ్లందరినీ ఓ గ్యాంగ్ ఒక చోటకు చేర్చుతుంది. ట్రైనింగ్ ఇస్తుంది. చైనాలోకి చొరబడి రహస్యాలు తెలుసుకోవాలని ఆదేశాలు ఇస్తుంది. ఆ గ్యాంగ్ ఎవరు? అసలు చైనాలోకి ఎందుకు వెళ్లారు? చైనా వేసిన ఎత్తుగడ ఏంటి? చివరకు ఆ ఆరుగురు ఏం చేస్తారు? దేశం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది కథ.

    నటీనటులు

    భోజ్ పురి కారెక్టర్‌లో ఆవేశం, పంజాబీ పాత్రతో ఎమోషన్స్, నేపాలి కారెక్టర్‌తో కామెడీ, త్రిపుర కారెక్ట, తెలుగు పాత్రలో కోపం, బెంగాలి పాత్రతో కాస్త రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను నటీనటులు పోషించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసిన అమ్మాయిలు అందంగా కనిపించారు. చక్కగా నటించారు. యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు. విలన్‌గా కనిపించిన చైనా కారెక్టర్ బాగానే పండింది. మిగిలిన వారంతా పరిధి మేరకు నటించారు.

    విశ్లేషణ

    ప్రాంతాలు వేరైనా కూడా భారతీయులంతా ఒక్కటే అని భారతీయన్స్ సినిమాలో చూపించాడు. నార్త్ ఈస్ట్‌లో జరిగే దుశ్చర్యలు, వారిపై చూపించే వివక్షతను ఇందులో బాగా చూపించారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి.. శత్రు దేశాలు మన మీద ఎలాంటి పన్నాగాలు పన్నుతాయనే వాటిని చూపించారు. దేశంలోని డ్రగ్స్ సమస్యను కూడా టచ్ చేశాడు దర్శకుడు. ఇలా అన్ని కోణాల్లో మన దేశాన్ని చూపించాడు.

     

    ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రల పరిచయం, వారి వారి ఫ్లాష్ బ్యాక్‌లు చూపిస్తారు. ఏం జరుగుతుందో అర్థం కాన్నట్టుగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో అసలు కథ, ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ ఫైట్ భారీగా తెరకెక్కించారు. క్లైమాక్స్ దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. దేశంలోని రక్షణ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇలా ఎన్నో సంస్థల పని తీరుని చూపించారు.

     

    సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. సిక్కిం ప్రాంతాన్ని చక్కగా చూపించారు కెమెరామెన్. సంగీతం, ఆర్ఆర్‌ బాగుంది. . ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఆ భారీతనం తెరపై కనిపిస్తోంది. ఇలాంటి సాహసోపేతమైన సినిమాలు తీసినందుకు నిర్మాతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

    రేటింగ్ 2.75