• November 2, 2021

Bandla Ganesh: ఫ్యాన్స్ కోసం స్పెషల్ డైలాగ్ అలా.. దటీజ్ బండ్ల గణేష్

Bandla Ganesh: ఫ్యాన్స్ కోసం స్పెషల్ డైలాగ్ అలా.. దటీజ్ బండ్ల గణేష్

    Bandla Ganesh బండ్ల గణేష్ మాటలు తూటాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. స్టేజ్ ఎక్కితే చాలా ఆయన్ను మాటలు పూనుతాయి. ఒళ్లంతా మాటల ప్రవాహామే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మొదలుపెడితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా సైడ్ అయిపోవాల్సిందే. ఒక్కోసారి ఆయన స్పీచులు, ప్రాసలు వింటే.. రైటర్‌గా మంచి భవిష్యత్తుందనిపిస్తుంది.

    తన సినిమాలకు తానే మాటలు రాసుకునేంత కెపాసిటీ ఉందంటూ బండ్ల గణేష్ మీద ప్రశంసలు కురిపిస్తుంటారు నెటిజన్లు. అయితే ఈ ఏడాది జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అందులో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈశ్వరా పరమేశ్వరా అంటూ మొదలు పెట్టిన స్పీచ్ లఫూట్ వరకు వెళ్లింది.

    అయితే బండ్లన్న మాట్లాడిన మాటలను హలో ట్యూన్‌గా పెట్టేశారట. వింక్ యాప్లో ఈశ్వరా పరమేశ్వర అనే డైలాగ్ హలో ట్యూన్‌గా వచ్చిందంటూ..అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్లన్న మాత్రం మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక బండ్ల గణేష్ ప్రస్తుతం డేగల బాబ్జీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ చెబుతూ బండ్లన్న షేర్ చేస్తోన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

    Leave a Reply