- January 26, 2024
అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ‘అథర్వ’
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన చిత్రం ‘అథర్వ’. ఓ క్రైమ్ సీన్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యత ఎలా ఉంటుందన్నది క్లియర్‌గా వివరిస్తూ అథర్వ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని.. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకుంది.
https://www.primevideo.com/region/eu/detail/0H13YMNF387AUM46BLWIUMGSSL
ఇంత వరకు ఎన్నో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లను చూసిన ఆడియెన్స్‌కు ఈ అథర్వ కొత్త ఫీలింగ్ ఇచ్చింది. క్లూస్ టీం పడే కష్టాన్ని చూపించారు. ఇక ఈ మూవీ థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. ఈటీవీ విన్‌లోనూ రిలీజ్ అయింది. అక్కడి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక ఇప్పుడు అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. మరి ఇక్కడి ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అథర్వ ఆకట్టుకునేలా ఉంది. అథర్వ సినిమాకు అటు థియేటర్ ఆడియెన్స్, ఇటు ఓటీటీ లవర్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది.