• October 31, 2021

త్వరలోనే అవన్నీ మాయమవ్వాలి.. సుమ ఫన్నీ వీడియో

త్వరలోనే అవన్నీ మాయమవ్వాలి.. సుమ ఫన్నీ వీడియో

    బిగ్ బాస్ షోలో యాంకర్ సుమ అడుగు పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గత ఏడాది అందరినీ పిచ్చోళ్లను చేద్దామని సుమ, బిగ్ బాస్ టీం, నాగార్జున అందరూ కలిసి ప్లాన్ వేశారు. సుమను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. సుమ కూడా తన బ్యాగ్‌ను పట్టుకొచ్చేసింది. అయితే జనాలు మాత్రం అంత పిచ్చోళ్లేమీ కాదు. ప్రోమోలను చూసి నమ్మేరోజులు పోయాయి. అలా బిగ్ బాస్ స్టేజ్ మీద సుమ అల్లరి చేసేందుకు మాత్రమే వచ్చిందని ముందే కనిపెట్టేశారు.

    నాల్గో సీజన్ కంటెస్టెంట్లతో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా అవినాష్ అరియానా, మెనాల్ అఖిల్ సోహెల్ మీద సుమ వేసిన సెటైర్లు బాగానే పేలాయి. నేను ఆడ, మగ అంటూ సోహెల్ టైపులో కథ వేరే ఉంటది అని సుమ కౌంటర్లు వేసింది. ఇక ఈ దీపావళి స్పెషల్‌గా నేడు రాబోతోన్న బిగ్ బాస్ ఎపిసోడ్‌లోనూ సుమ కనిపించబోతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సుమ షేర్ చేసింది. బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టాలన్నా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.

    గత ఏడాది కూడా ఇలానే కరోనా పరీక్షలు చేయించుకున్నాను అంటూ సుమ చెప్పింది. ఈ సారి కూడా చేయించుకున్నాను. కనీసం వచ్చే ఏడాదికైనా ఇవన్నీ పోవాలి.. భగవంతుగా ఇవన్నీ వెళ్లిపోవాలి అని సుమ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి నేటి సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న బిగ్ బాస్ షోలో సుమ సందడి చేయబోతోంది. సుమతో పాటు పుష్పక విమానం ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ రాబోతోంది. అఖిల్ అరియానా సోహెల్ వంటి వారు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లబోతోన్నారు. గ్లాసులు అడ్డంగా పెట్టి వారితో మాట్లాడించబోతోన్నాడు బిగ్ బాస్.

    Leave a Reply