• November 10, 2021

అవసరమైతే ఆ పని కూడా చేస్తా!.. వామ్మో తెగించిన అనసూయ

అవసరమైతే ఆ పని కూడా చేస్తా!.. వామ్మో తెగించిన అనసూయ

    అనసూయ బుల్లితెర, వెండితెరపై దుమ్ములేపుతోంది. ఇప్పుడే దాక్షాయణిగా అనసూయ దుమ్ములేపేసింది. పుష్ప సినిమాలో దాక్షాయణిగా అనసూయను చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. రంగమ్మత్తను మించి ఇది వేరే లెవెల్ అనేలా ఉంది. కచ్చితంగా ఈ సారి దక్షిణాదిన అనసూయ పేరు మార్మోగిపోయేలా ఉంది. అయితే పాత్ర కోసం ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉంటుంది కాబట్టే అనసూయకు ఇలాంటి విభిన్న కథలు వస్తుంటాయి.

    తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈక్రమంలో కొందరు కొన్ని ప్రశ్నలను సంధించారు. కోలీవుడ్‌లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావ్? ఏ ఏ సినిమాలు చేస్తున్నావ్? దాక్షాయణి లుక్కు ఎలా ఉండబోతోందంటూ ఇలా పలు రకాల ప్రశ్నలను సంధించారు. అయితే అనసూయకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. పాత్ర కోసం గుండు కొట్టించుకుంటావా? అని ఓ నెటిజన్ అడిగేశాడు. అసలే ఆడవాళ్లకు జుట్టు అంటే మహాప్రాణం.

    అందులోనూ అనసూయకు తన జుట్టు అంటే వల్లమాలిన ప్రేమ. వారానికి ఒకసారి హెయిర్ క్లీనిక్‌కు వెళ్తుంటుంది. జుట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలాంటి అనసూయకు సరైన ప్రశ్నే ఎదురైంది. అయితే గుండు కొట్టించుకుంటావా? అని అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది అనసూయ. ఒక వేళ పాత్ర డిమాండ్ చేస్తే.. అది అవసరమనిపిస్తే తప్పకుండా గుండు చేయించుకుంటాను అని చెప్పింది. మొత్తానికి ఇది మాత్రం చాలా డేరింగ్ స్టేట్మెంట్.. పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ.

    పుష్పలో దాక్షాయణిగా అన్ని భాషల ప్రేక్షకులను అనసూయ ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. ఆ కాసుల పేరు, చేతిలో వడ కత్తెర, ఆ చూపులు, ఆ జుట్టు, హెయిర్ స్టైల్, కట్టూబొట్టూ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇకపై రంగమ్మత్తను మరిచిపోయి దాక్షాయణిగానే అందరూ గుర్తు పెట్టుకునేలా ఉన్నారు.

     

    Leave a Reply