• October 24, 2021

Anasuya Bharadwaj: బుల్లి నిక్కర్‌లో అనసూయ.. అలా చేసినందుకు ఫుల్ ఖుషీ అవుతున్న యాంకర్!

Anasuya Bharadwaj: బుల్లి నిక్కర్‌లో అనసూయ.. అలా చేసినందుకు ఫుల్ ఖుషీ అవుతున్న యాంకర్!

    Anasuya Bharadwaj  బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన పాత్రలు పోషించే నటిగా, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే సెలెబ్రిటీగా అనసూయ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. బుల్లితెరపై అనసూయకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఏది చేసినా కూడా ఓ సెన్సేషన్ అవుతుంది. ఫోటో షేర్ చేసినా, ఓ చిన్న మాట మాట్లాడినా కూడా అందరి చూపు పడుతుంది. ట్రోలింగ్‌కు గురవుతుంది.

    తాజాగా అనసూయ మా ఎన్నికల వివాదంలోనూ తలదూర్చింది. మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, రాత్రి గెలిచాను అని చెప్పిన మీడియా.. ఉదయం అయ్యే సరికి ఓడాను అనిచెప్పింది. అంటే రాత్రి ఏం జరిగిందబ్బా అని అనసూయ కౌంటర్ వేసింది. ఆ తరువాత కోట శ్రీనివాస రావు మీద అనసూయ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అనసూయ ధరించే బట్టలు నాకు నచ్చవు అని కోట అనడంతో.. అనసూయ దుమ్ముదులిపింది. ఓ సీనియర్ నటుడు నుంచి అలాంటి వ్యాఖ్యలా? అంటూ నిలదీసింది.

    ఇక అనసూయ ఇప్పుడు దుబాయ్‌కి చెక్కేసినట్టు కనిపిస్తోంది. రవితేజ ఖిలాడీ సినిమా కోసం అనసూయ అక్కడికి వెళ్లింది. నిన్న ఫ్లైట్ జర్నీ చేసిన అనసూయ.. ఈ రోజు అక్కడ ల్యాండ్ అయినట్టుంది. అయితే ఫ్లైట్‌లో ఇష్టమొచ్చినవన్నీ తినేసింది. అక్కడ పెరిగిన కేలరీలను వర్కవుట్లతో కరిగించేసిందట. అందుకు చాలా సంతోషంగా ఉందని అనసూయ తెలిపింది. అనసూయ వర్కవుట్లు చేసిన విధానం, బుల్లి నిక్కర్లో అనసూయ కనిపించిన తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు.

    Leave a Reply