• November 16, 2021

No Nut November : నవ్వొంచిందన్న హీరో!.. అల్లు శిరీష్ సంగతి ఏంటి?

No Nut November : నవ్వొంచిందన్న హీరో!.. అల్లు శిరీష్ సంగతి ఏంటి?

    సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుంది? ఎందుకు వైరల్ అవుతుంది?అనేది ఎవ్వరూ చెప్పలేరు. వింత వింత చాలెంజ్‌లన్నీ పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా మరో కొత్త చాలెంజ్ మొదలైంది. ఇది చెప్పుకోవడానికి కాస్త వింతగా వెరైటీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకుని తీరాలి. ఎందుకంటే ఆ వింత చాలెంజ్, దాని మీద వచ్చిన ఓ మీమ్ చూసి అల్లు శిరీష్ తెగ నవ్వుకున్నాడు. అందుకే ఈ కథ ఏంటో మనం కూడా తెలుసుకోవాలి.

    నవంబర్ అంటే ఇంతకు ముందు ఓ చాలెంజ్ అందరికీ గుర్తుకు వచ్చేది. నో షేవ్ నవంబర్ అనే చాలెంజ్ గురించి అందరికీ తెలిసిందే. నవంబర్ నెల అంతా కూడా కటింగ్ చేసుకోకుండా, గడ్డం గీసుకోకుండా ఉండాలి. అలా పొదుపు చేసిన డబ్బంతా చారిటీకి ఇవ్వాలని ఏదో దేశంలో ఎక్కడో చాలెంజ్ మొదలైంది. అలా నో షేవ్ నవంబర్ బాగానే ఫేమస్ అయింది. అయితే తాజాగా ఇప్పుడు మరో వింత చాలెంజ్ పుట్టుకొచ్చింది.

    నో నట్ నవంబర్ చాలెంజ్ అంటూ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నో నట్ నవంబర్ చాలెంజ్ అంటే పైకి దాని అర్థమేమీ గోచరించదు. నట్ గింజలు.. అంటే గింజలు తినకుండా ఉండాలా? అనే అనుమానం కలుగుతుంది అందరికీ. అయితే దీనిపైనే ఓ మీమ్ వచ్చింది. వాటిని చూసి అల్లు శిరీష్ తెగ నవ్వుకున్నాడుట. అయితే నో నట్ నవంబర్ చాలెంజ్ మీనింగ్ ఏంటో ఓ సారి చూద్దాం.

    నో నట్ నవంబర్ అంటే నవంబర్ నెల అంతా కూడా శృంగారానికి, హస్త ప్రయోగానికి దూరంగా ఉండాలట. అదే ఈ చాలెంజ్ ఉద్దేశ్యమట. అయితే హస్త ప్రయోగానికి, శృంగారానికి కేటాయించే ఈ సమయాన్ని కొత్త విషయాలు, కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు నవంబర్ నెలను కేటాయించాలనేది ఈ చాలెంజ్ వెనుకున్న కథ అట. మొత్తానికి ఇది సాధ్యమయ్యే పనేనా? అని అందరూ అనుకుంటున్నారు.

    అలా ఇంత అర్థం ఉన్న నో నట్ నవంబర్ మీద వేసిన మీమ్‌కు అల్లు వారబ్బాయి నవ్వేసుకున్నాడు. నో నట్ నవంబర్ అంటే.. నట్స్ తినకుండా ఉండటమే కదా? మావా అంటూ వచ్చిన మీమ్‌ను చూసి ఈ రోజు ఫుల్లుగా నవ్వుకున్నాను.. ఈ మంగళవారం నాకు ఇలా మొదలైంది.. ఎంజాయ్ యువర్ నట్స్ అంటూ కౌంటర్ వేశాడు. మరి ఈ చాలెంజ్‌ను అల్లు శిరీష్ స్వీకరిస్తాడో లేదో మరి. అల్లు  శిరీష్ ఇప్పుడు అను ఇమాన్యుయేల్‌తో కలిసి ప్రేమ కాదంటా అనే సినిమాతో రాబోతోన్నాడు.

    Leave a Reply