ఈవెంట్‌లో హీరోయిన్ ఓవర్ యాక్షన్.. హగ్గు, కిస్సుతో అల్లు అర్జున్ రచ్చ

ఈవెంట్‌లో హీరోయిన్ ఓవర్ యాక్షన్.. హగ్గు, కిస్సుతో అల్లు అర్జున్ రచ్చ

    ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతోన్న పుష్పక విమానం ట్రైలర్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శాన్వీ మేఘన కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయింది. బన్నీ మీద తన ప్రేమ, ప్రతీ ఒక్క అభిమాని ప్రేమకు చిహ్నంగా అంటూ స్టేజ్ మీదే మోకాళ్ల మీద నిల్చుని బన్నీకి ముద్దలు ఇచ్చింది. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. అయితే ఇక ఆ తరువాత బన్నీ వంతు వచ్చింది. బన్నీ స్టేజ్ మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

    స్టేజ్ మీదకు వచ్చిన బన్నీ ప్రతీ ఒక్క విషయం గురించి మాట్లాడాడు. విజయ్ దేవరకొండ ఎదిగిన తీరు, నటుడిగానే కాకుండా బిజినెస్, ప్రొడక్షన్ కంపెనీ ఇలా ప్రతీ ఒక్క దాంట్లో విజయ్ దూసుకుపోతోన్న తీరు గురించి చెప్పాడు. ఆనంద్ దేవరకొండ పేరు మరిచినా మళ్లీ సారి చెప్పి కరెక్ట్ చేసుకున్నాడు. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది.. అది తెలుసుకుని ముందుకు వెళ్లాలి అంటూ బన్నీ స్పీచును ఇచ్చేశాడు. ఇక తన జీవితంలో మొదటి సారి తన కోసం ఓ అమ్మాయి మోకాళ్ల మీద నిల్చుందని అన్నాడు.

    ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. శాన్వీ నాకోసం అలా మోకాళ్ల మీద కూర్చుంది. ఇకపై అలా చేయకు.. అంటూ హగ్ చేసుకుని చిన్నగా ముద్దు పెట్టేశాడు. మొత్తానికి బన్నీ మీదున్న ప్రేమను శాన్వీ అలా బయటపెట్టేసింది. అభిమానుల మీదున్న ప్రేమ బన్నీ కూడా చూపించేశాడు. ఇకపై అలా మోకాళ్ల మీద కూర్చోవద్దు అంటూ స్వీట్‌గా చెప్పేశాడు బన్నీ. అదే వేదికపై పునీత్ రాజ్ కుమర్‌ను బన్నీ తలుచుకున్నాడు.

    Leave a Reply