• August 10, 2025

ఎయిర్ పోర్టులో ‘భాయ్‌’కి వింత అనుభవం!

ఎయిర్ పోర్టులో ‘భాయ్‌’కి వింత అనుభవం!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు అక్కడే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ వద్ద మన భాయ్ (అల్లు అర్జున్)కి వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ అంటే అందరికీ ఒకే రూల్స్ ఉంటాయి. చెకింగ్, సెక్యురిటీ పద్దతులన్నీ ఒకేలా ఉంటాయి. ఎవరైనా సరే అక్కడ ఐడీ ప్రూఫ్ చూపించాలి, మొహాన్ని చూపించాల్సి ఉంటుంది.

    నేను సెలెబ్రిటీని, మొహాన్ని దాచుకుంటాను.. అంటే కుదరదు. మొహానికి మాస్క్ ఉంటే కచ్చితంగా అక్కడ తీసి ఫేస్ చూపించాలి. ఐడీ కార్డుని, ఆ ఫేస్‌ను అక్కడి అధికారులు చూసి లోపలకు పంపుతారు. ఇది రూల్. అందరికీ ఒకేలా వర్తించే రూల్. కానీ తాజాగా భాయ్ మాత్రం మాస్క్ వేసుకుని వెళ్లాడు. అక్కడ సెక్యురిటీ గార్డ్ మాస్క్ తీసి ఓ సారి ఫేస్ చూపించమని అడిగాడు.

    కానీ భాయ్ అసిస్టెంట్ మాత్రం ఇతను అల్లు అర్జున్ అని చెప్పినట్టుగా కనిపిస్తోంది. అయినా సరే ఓ సారి చూపించాల్సిందే అని ఆ అధికారి చెప్పినట్టుగా ఉన్నాడు. దీంతో మన భాయ్ అలా మాస్క్ తీసేసి.. ఫేస్ చూపించి మళ్లీ మాస్క్ వేసుకున్నాడు. ఆ రూల్ ఏదో ముందే పాటిస్తే సరిపోద్ది కదా?.. లోపలి వరకు ఫ్యాన్స్ అయితే రారు కదా.. మాస్క్ తీసేసి ఫేస్ చూపించి సైలెంట్‌గా వెళ్లిపోయి మళ్లీ మాస్క్ వేసుకుంటే సరిపోద్ది కదా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.