Bangarraju Collection : దుమ్ములేపిన బంగార్రాజు.. ఫస్ట్ డే ఎంతంటే?

Bangarraju Collection : దుమ్ములేపిన బంగార్రాజు.. ఫస్ట్ డే ఎంతంటే?

    Bangarraju First Day Collection బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగడం ఫుల్ ప్లస్ అయింది. ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో తప్పా మరెప్పుడూ అంతగా ఆడదు. ఈ విషయాన్ని నాగ్ ముందే పసిగట్టాడు. అందుకే ఏది ఏమైనా సరే బంగార్రాజును సంక్రాంతి బరిలోకి దించాలని నాగ్ ఫిక్స్ అయ్యాడు. తెగించేసి బరిలోకి దిగాడు. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేశాడు.

    మొత్తానికి జనవరి 14న బంగార్రాజు విడుదలైంది. మిక్స్డ్ టాక్‌తో బంగార్రాజు నిన్నంతా వైరల్ అయింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా.. ఈ సంక్రాంతి బరిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద చిత్రం బంగార్రాజు కావడంతో కలెక్షన్ల వర్షం కురిపించేసింది. ఇక నిన్న విడుదలైన రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి చిత్రాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

    ఆ సినిమాలు విడుదలయ్యాయని కొంతమందికి తెలియనే తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక నేడు హీరో సినిమా కూడా విడుదలైంది. దాని పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉంది. అయితే బంగార్రాజుకు ఇవన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్‌లో ఎవరైనా సినిమాకు వెళ్లాలని అనుకుంటే అది కేవలం బంగార్రాజు మాత్రమే ఆప్షన్ అవుతుంది.

    అలా మొదటి రోజు బంగార్రాజుకు మంచి కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. నైజాంలో 2.03 కోట్లు, సీడెడ్‌లో 1.74 కోట్లు, ఉత్తరాంద్రలో 1.24కోట్లు, ఈస్ట్ 76 లక్షలు, వెస్ట్ 65 లక్షలు, గుంటూరు 89 లక్షలు, కృష్ణా 46 లక్షలు, నెల్లూరు 34 లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 8 కోట్లు వసూల్ అయ్యాయి.

    అలా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 12.9 కోట్ల గ్రాస్.. 8.11 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. కర్ణాటక రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే 80 లక్షలు వచ్చినట్టు టాక్. ఓవర్సీస్‌లో 45 లక్షలు అని తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు 9.36 కోట్ల షేర్.. 15.35 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 33.80 కోట్లకు అమ్ముడుపోయింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 38.15 కోట్లకు సేల్ అయింది. అలా చూసుకుంటే 39 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్‌తో బంగార్రాజు బరిలోకి దిగింది. ఇంకా దాదాపు 30 కోట్లను కలెక్ట్ చేయాల్సి ఉంది.

    Leave a Reply