- December 11, 2021
Lakshya Day 1 Collection : అఖండ దెబ్బకు కనిపించని లక్ష్య.. తొమ్మిదో రోజూ రచ్చే

Akhanda Day 9 Collection అఖండ తొమ్మిదో రోజు కూడా దుమ్ములేపేసింది. శుక్రవారం వస్తే సినిమా రాత మారిపోతుంది. కానీ బాలయ్య సినిమా మాత్రం ఇంకా ఊపులోనే ఉంది. దుమ్ములేపుతోంది. గమనం, లక్ష్య అనే సినిమాలు నిన్న విడుదలయ్యాయి. ఇందులో గమనం లెక్కలు మాత్రం అస్సలు పట్టించుకునే స్థాయిలో కూడా లేవు. ఇక కొద్దోగొప్పో లక్ష్య గురించి చెప్పుకోవాలి.
మామూలుగా అయితే బాలయ్య విశ్వరూపం చూపించిన అఖండ ముందు నిలబడాలంటే ఇలాంటి సినిమాల వల్ల కావు. కనీసం పుష్ప విడుదలైతే అఖండ స్పీడుకు బ్రేకులు పడతాయి. అప్పటి వరకు బాలయ్య బాక్సాఫీస్‌ను ఉతికి ఆరేసేట్టు కనిపిస్తోంది. నిన్న బాలయ్య కూడా బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోయింది. లక్ష్య మొదటి రోజు లెక్కలు, బాలయ్య అఖండ తొమ్మిదో రోజు లెక్కలు దాదాపు ఒకేలా ఉండబోతోన్నట్టు కనిపిస్తున్నాయి.
అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 1.6 నుంచి 1.8 కోట్ల రేంజ్ గ్రాస్‌ను అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరో వైపు నాగ శౌర్య లక్ష్య కూడా ఇదే రేంజ్‌లో గ్రాస్‌ను కొల్లగొట్టనున్నట్టు తెలుస్తోంది. అయినా అఖండ దెబ్బకు లక్ష్య ఎక్కడా కూడా పైకి లేవడం లేదు. అఫీషియల్ లెక్కలు రావాలంటే మాత్రం ఇంకా సమయం పడుతుంది.
మొత్తానికి బాలయ్య మాత్రం ఎనిమిదో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు. అఖండ సినిమా 53 కోట్లకు అమ్ముడుపోగా.. 54 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలా మొత్తానికి ఎనిమిది రోజుల్లోనే ఆ టార్గెట్ పూర్తి చేశారు. ఓవర్సీస్‌లో 4.58 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 3.85 కలుపుకుంటే.. మొత్తంగా 54.57 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ రోజు వచ్చిందంతా కూడా లాభాలే అన్నమాట.