- December 12, 2021
Akhanda Collection : దుమ్ములేపిన అఖండ.. పదో రోజూ ప్రభంజనమే.. వంద కోట్లకు దగ్గర్లో!

Akhanda Day 10 worldwide Collection అఖండ సినిమా రెండో వారాంతంలో మరింత స్పీడుతో దూసుకుపోతోంది. ఈ రెండో వీకెండ్లో థియేటర్లన్నీ కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. లక్ష్య, గమనం సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలు అవి వచ్చాయన్న సంగతే సాధారణ జనానికి తెలియడం లేదు. దీంతో అందరూ అఖండ సినిమానే చూడటానికి మొగ్గుచూపుతున్నారు.
దీంతో శనివారం నాడు థియేటర్లలో అఖండ మళ్లీ రచ్చ చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లో అఖండ థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం అఖండ మరో ఫీట్‌ను అందుకునేందుకు దగ్గర్లో ఉంది. వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఇంకో రెండు రోజుల్లో ఆ ఫీట్‌ను చేరుకునేట్టు కనిపిస్తోంది.
మొత్తంగా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 9 రోజుల్లో 56.15 కోట్ల షేర్‌ను, 93 కోట్ల గ్రాస్ మార్క్‌ని అందుకుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో 75 కోట్ల గ్రాస్ మార్క్‌ని అందుకుంది. ఇక 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం దగ్గరదగ్గరగా మూడు కోట్ల రేంజ్లో గ్రాస్‌ని అందుకునేలా ఉందని తెలుస్తోంది.
ఆ లెక్కన ఈ చిత్రం ఇంకో రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుంది. ఆ ఫీట్‌తో బాలయ్య సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా బాగున్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపించడం కష్టం. కానీ ఏకంగా బాలయ్య మాత్రం వంద కోట్ల గ్రాస్‌ను రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆదివారం నాడు మరింత కలెక్షన్ పెరిగేట్టు కనిపిస్తోంది.