• October 29, 2021

రూపు రేఖలు మార్చుకున్న ఫేస్ బుక్.. కొత్తగా పేరు ఏంటంటే?

రూపు రేఖలు మార్చుకున్న ఫేస్ బుక్.. కొత్తగా పేరు ఏంటంటే?

    ఫేస్ బుక్ అనే పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమో. అంతగా ఫేస్ బుక్ అందరి జీవితాల్లోకి చొరబడింది. ఏ ఖాతాలు ఉన్నా లేకపోయినా కూడా ఫేస్ బుక్ ఖాతా మాత్రం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఫేస్ బుక్ అనేది అందరూ వాడుతున్నారు. మన తెలుగులో అయితే ముఖ పుస్తకం అంటూ పిచ్చి అనువాదాలు కూడా చేశారు. అయితే తాజాగా ఫేస్ బుక్ రూపు రేఖలు మారిపోయాయి. కొత్త పేరును మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించాడు.

    ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫేస్ బుక్‌ను వాడుతున్నారు. ఫేస్ బుక్‌కు అనుగుణంగా వాట్సప్, ఇన్ స్టాగ్రాం వంటివి ఉన్నాయి. అయితే ఈ మధ్య ఫేస్ బుక్ మీద ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఫేస్ బుక్ బ్రాండ్ వ్యాల్యూ కాస్త తగ్గినట్టు అనిపించిందట. అందుకే ఈ కొత్త పేరును మార్క్ మావ ప్రకటించాడట.

    భవిష్యత్‌ లక్ష్యాలను ప్రతిబింబించేలా ‘మెటా’గా మార్చేశారు. ఫేస్‌బుక్‌ వార్షిక సమావేశంలో ఈ పేరును ప్రకటించాడు జూకర్ బెర్గ్‌. డిజిటల్ రియాల్టీ అయిన మెటావర్స్‌కు చిన్నపేరే మెటా. ఐతే కంపెనీ పేరు మార్చినా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా యాప్స్‌ మాత్రం అలాగే కొనసాగుతాయి. పేరు మార్పు వెనుక భారీ ఫ్యూచర్ ప్లాన్‌ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ఫేస్ బుక్ అనే పదం కూడా కనిపించకపోవచ్చేమో.

    Leave a Reply