• December 8, 2021

బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా!.. అసలు విషయం చెప్పిన పూర్ణ

బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా!.. అసలు విషయం చెప్పిన పూర్ణ

    హీరోయిన్ పూర్ణకు అందం కావాల్సినంత ఉంది. అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరం అవుతున్నా కూడా పూర్ణకు చాన్సులు వస్తున్నాయి. కానీ పూర్ణకు మాత్రం స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. అడపాదడపా చిత్రాలను చేసుకుంటూ వెళ్తోంది. అయితే అఖండ సినిమాతో ఇప్పుడు పూర్ణ మళ్లీ హాట్ టాపిక్ అయింది.

    బుల్లితెరపై ఢీ షోతో, ఇతర స్పెషల్ ఈవెంట్లతో పూర్ణ బాగానే సందడి చేస్తుంటుంది. బుగ్గలు కొరకడం, ముద్దులు పెట్టడంతో పూర్ణ ఎంతో ఎక్స్‌పర్ట్‌గా మారింది. అలాంటి పూర్ణ కెరీర్‌లో అవును అనే ఓ హారర్ మూవీ వచ్చింది. అది ఓ రేంజ్‌లో హిట్ అవ్వడంతో అవును 2 కూడా వచ్చింది. కానీ అవును సినిమానే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందులో రవిబాబు దెయ్యం రూపంలో చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు.

    దెయ్యం వచ్చి రేప్ చేయడం, తృ‌ప్తి పొందడం అవును సినిమాలో చూపిస్తాడు. హీరోయిన్ బాత్రూంలో స్నానం చేస్తే దెయ్యం లోపలే ఉంటుంది. అలా ఆ దెయ్యం కూడా కామాంధుడిగా మారుతుంది. కామాంధుడే దెయ్యంగా మారాడు కూడా. అయితే ఆ సినిమాలో అలా నటించడంతో పూర్ణకు ఇంకా ఎక్కువ భయం మొదలైందట.

    మామూలుగానే తనకు దెయ్యాలంటే భయమని, పైగా అవును సినిమాలో నటించినప్పటి నుంచి బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా భయపడతాను అని, ఎవరైనా ఉన్నారా? దెయ్యం వచ్చిందా? అన్నట్టుగా చూస్తుందట. ఈ విషయాలన్నీ కూడా పూర్ణ తాజాగా ఆలీతో సరదాగా షోలో చెప్పింది. వచ్చే వారం రానున్న ఎపిసోడ్ ప్రోమోను ఇప్పుడు వదిలారు. అందులో పూర్ణ ఈ విషయాలన్నీ చెప్పింది.

    Leave a Reply