• December 4, 2021

Bigg Boss 5 Telugu : ప్రియాంక అవుట్, మానస్‌కు మనశ్శాంతి… పింకీ మాటలే నిజమయ్యాయ్

Bigg Boss 5 Telugu : ప్రియాంక అవుట్, మానస్‌కు మనశ్శాంతి… పింకీ మాటలే నిజమయ్యాయ్

    Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం ఎలిమినేషన్ ఎలా ఉంటుందో అందరూ ఊహించారు. మామూలుగా అయితే పన్నెండో వారంలోనే జరగాల్సిన ఈ ఎలిమినేషన్ మరో వారం వాయిదా పడింది. పన్నెండో వారంలోనే కాజల్, ప్రియాంకలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి పడేశారు.

    దీంతో అందరూ బిగ్ బాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి కంటే ప్రియాంక, కాజల్, సిరి ఎందులో బెటర్..వారిని ఎందుకు లోపలే ఉంచుకుంటున్నావ్? అంటూ జనాలు తిట్టిపోశారు. దీంతో దారిలోకి వచ్చిన బిగ్ బాస్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలుస్తోంది. ప్రియాంకను ఎలిమినేట్ చేసి పాడేశాడట.

    ప్రియాంక ఎలిమినేషన్‌తో ఇటు ప్రేక్షకులు, అటు మానస్ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. మొత్తానికి మానస్ ప్రియాంక పిచ్చి ట్రాక్‌కు ముగింపు పలికేశారు. ఇన్నాళ్లు ఆ ఘోరాలు చూడలేకపోయారు జనాలు. మొత్తానికి ఇప్పుడు ప్రియాంక ఎలిమినేట్ అయిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

    నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియాంక తన ఎలిమినేషన్ గురించి షన్నుతో మాట్లాడింది. ఈ వారం నేను అయినా కాజల్ అయినా ఎలిమినేట్ అవుతామని షన్నుతో ముచ్చటించింది. తీరా చూస్తే అదే నిజమైంది.

    Leave a Reply