- December 2, 2021
Guppedantha Manasu: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. మారిపోయార్ సర్.. రిషి మనసును కనిపెట్టిన వసు
గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే గురువారం.. అంటే Guppedantha Manasu Episode 310లో వసు, రిషి కారులో ప్రయాణిస్తూ ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటారు. రిషి కొత్త పద్దతులు, మాట తీరుపై వసు ప్రశ్నలు కురిపిస్తుంది. దీంతో రిషి తన మనసులోనూ అలాంటి ఫీలింగే ఉందని, అదేంటో అర్థం అవ్వడం లేదని తనలో తాను అనుకుంటాడు. మొత్తానికి గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.
దేవయాణి, మహేంద్రలకు వసుధార కేవలం స్టూడెంట్ అని చెప్పిన రిషి.. తనలో తాను ప్రశ్నలు వేసుకున్నాడు. కేవలం స్టూడెంటేనా? అడ్మిషన్ నుంచి ఆర్టికల్ వరకు నేను వసును అంటూనే వచ్చాను.. కానీ వసు మాత్రం నన్ను జెంటిల్మెన్, సీరియస్ సింహం అంటూ వచ్చింది. అసలు నాకు నేను అర్థం కావడం లేదు. ఒకరు చెబితే వినను.. నా గురించి నేను తెలుసుకోలేను.. చిరాగ్గా ఉన్నావ్ ఎందుకు? అంటూ రిషిని మహేంద్ర అడుగుతాడు.
సంతోషంగా ఉన్న వాళ్లను ఎందుకు సంతోషంగా ఉన్నావ్ అని అడిగితే బాగుంటుంది.. చిరాగ్గా ఉన్నవాళ్లను అడిగితే అంటూ రిషి పూర్తి చేసేలోపు మహేంద్ర అందుకుంటాడు.. చిరాగ్గా ఉండేవాళ్లను అడిగితే మరింత చిరాగ్గా ఉంటుందని తెలుసు అని మహేంద్ర అంటాడు. సమాధానం తెలిసి కూడా ఎందుకు అడిగుతారు డాడ్ అని రిషి అంటాడు. అలిసిపోయాను అంటూ చెబుతాడు రిషి..
అలసిపోతే నలుగురితో కలిసిపోతే బాగుంటుంది కదా? అని మహేంద్ర సలహా ఇస్తాడు. కొన్నింటికి ఒంటరితనమే మందు అని రిషి అంటాడు.. ఎవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. .నీకు నువ్వే ప్రశ్నగా మారకుండా ఉంటే చాలు.. అలిసిపోయాను అన్నావ్ కదా? అలసట తీర్చుకో అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు.. డాడ్ నిజంగానే నేను అలిసిపోయాను.. కాలేజ్‌లో పని చేశాను.. గుడ్ నైట్ డాడ్ అని రిషి అంటాడు.. డాడీ కళ్లలో ఏంటా? ధైర్యం.. నన్నేదో చదివేసినట్టుగా.. నా మనసులో ఏముందో తెలిసినట్టుగా చూస్తున్నాడు అని రిషి అనుకుంటాడు.
మినిస్టర్ వన భోజనాలకు పిలిచాడని ఇంట్లో అంతా అనుకుంటారు. అయితే ఈ విషయం అందరికీ చెబుతాను అంటూ మహేంద్ర, రిషి, దేవయాణి, ధరణిలను పిలుస్తాడు అసలు విషయం చెబుతాడు ధర్మేంద్ర. కానీ దేవయాణి మాత్రం రానని చెబుతుంది. రిషి బతిమాలుతుంటే మరింత బెట్టు చేస్తుంటుంది. అక్కడి నువ్ ఎందుకు రానని అంటున్నావో నాకు తెలుసు పెద్దమ్మ.. అని రిషి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.
నీ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్ రాకపోతే నేను రాను అని రిషి కూడా అనేస్తాడు. రిషిని అలా ఎందుకు బాధపెడతావ్ అని ధర్మేంద్ర అంటాడు. దీంతో రిషిని కష్టపెట్టడం, బాధపెట్టడం ఇష్టం లేక ఇంకా ధరణి కోసం వస్తాను అని మొత్తానికి ఒప్పుకుంది. అందుకే నాకు పెద్దమ్మ అంటే ఇష్టం గౌరవం అని రిషి అంటాడు. అత్తయ్య గారు నన్ను కూడా వాడేస్తున్నారా? అని ధరణి తన మనసులో అనుకుంటుంది.
వన భోజనాలకు జగతిని కూడా ఆహ్వానిస్తాడు మినిష్టర్. మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన వెంటనే జగతి దగ్గరకు మహేంద్ర కూడా వస్తాడు. సరైన టైంకు వచ్చావ్ మహేంద్ర అని జగతి అంటుంది. ఇప్పుడే మినిస్టర్ ఫోన్ చేశాడు.. వన భోజనాలకు రమ్మని అన్నారు. మీ ఫ్యామిలీని ఆహ్వానించినట్టు చెప్పారు. కానీ నేను రాను. అక్కడికి వస్తే దేవయాణి అక్క ఉంటుంది. మళ్లీ ఏదో ఒక గొడవ పెట్టేందుకు చూస్తుంది.. రిషి మనసును గాయపరుస్తుంది అని జగతి ఫీలవుతుంది.
నువ్ రాక పోతే మేం కూడా వెళ్లమని మహేంద్ర మారాం చేస్తాడు. వసు కూడా మహేంద్రకు మద్దతిస్తుంది. మీరు ఇలా బెదిరిస్తే బెదిరిపోతానా? అని జగతి అంటుంది. బెదిరిపోవు. కానీ కరిగిపోతావ్ కదా? అని మహేంద్ర అంటాడు. నువ్ రాను అంటే రిషికి ఫోన్ చేస్తాను.. మన కాలేజ్ పరువుపోతుందని అంటాను అని మహేంద్ర బెదిరిస్తాడు. వద్దు మహేంద్ర మళ్లీ రిషి నాకు ఫోన్ చేస్తాడు అంటూ జగతి ఓకే చెప్పేసింది. కొడుకును అడ్డం పెట్టుకుని గెలుస్తున్నారు. మొత్తానికి ఒప్పుకున్నావ్ కదా? అని మహేంద్ర సెటైర్లు వేస్తాడు.
ఇక ఉదయమయ్యే సరికి వసు, జగతిలు వెళ్లేందుకు రెడీ అవుతారు. కానీ అంతలోపే కారు హారన్ వినిపిస్తుంది. రిషి సర్ కారు వచ్చినట్టుందని జగతి కావాలనే అంటుంది. అది రిషి సర్ కారే మేడం అని వసు వెళ్తుంది. ఇంటి డోర్ తెరవడంతోనే రిషి వచ్చి ఉంటాడు. వసును భయటకు తీసుకెళ్తున్నాను మేడం అంటూ జగతి మేడంకు చెప్పడంతో వసు షాక్ అవుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లొకేషన్ వెతికేందుకు వెళ్తున్నామని రిషి అంటాడు.
వన భోజనాల సమయంలో మిషన్ ఎడ్యుకేషన్ పనులు వద్దని మేడం చెప్పారు సర్ అని అంటుంది వసు. దీంతో జగతి షాక్ అవుతుంది. నేను వన భోజనాల సమయంలో వద్దు అన్నాను గానీ.. వెళ్లే దారిలో చూసుకుని వెళ్లొద్దు అని చెప్పలేదు కదా?.. వసు సరిగ్గా అర్థం చేసుకో నేనేం చెప్పానో అని అంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే గానీ అడుగు ముందుకు వేయదేమో.. మెయిల్ ఏమైనా పెట్టాలా? అని రిషి అంటాడు.
రిషి ఈ మధ్య వెటకారాలు బాగానే వేస్తున్నాడు అని జగతి లోలోపల అనుకుంటుంది. మెయిల్ ఏమీ వద్దులేండి సర్.. మీరు చెప్పారు కదా? సరిపోతుందని అంటుంది. వీళ్ల ప్రయాణం అంతు పట్టకుండా ఉంది..లొకేషన్ చూడటానికి వెళ్తున్నారా? నిజమా? కల్పితమా? ఎవరికి తెలుసు.. అని జగతి అనుకుంటుంది. ఇక కారులో వెళ్తున్న రిషి, వసులు మాట్లాడుకుంటూ వచ్చారు.
సర్ సడెన్‌గా మిషన్ ఎడ్యుకేషన్ గురించి లొకేషన్ ఎలా దొరికింది.. అని అంటుంది వసు. అప్పుడప్పుడు నేను కూడా పని చేస్తాను అని రిషి అంటాడు. నీకు ఏమనిపిస్తుంది.. అబద్దాలు చెప్పి.. మేడం దగ్గరి నుంచి నిన్ను తీసుకొచ్చాను అని అనిపిస్తుందా? అని అంటాడు.. అలా నేను ఎందుకు అనుకుంటాను.. సర్. మీలో మార్పు కనిపిస్తోంది.. అని వసు చెబుతుంది.
అంటే ఏంటి? అని రిషి అడుగుతాడు. అది ఇది అని చెప్పలేను కానీ కొత్తగా కనిపిస్తోంది.. అని వసు అంటుంది. నాక్కూడా అలానే ఉంది అంటూ లోలోపల రిషి అనుకుంటాడు.. వసుధార మీద కోప్పడే నేను.. తాను ఏం చేసినా కూడా కోపమే రావడం లేదు ఎందుకు అని రిషి తనలో తాను అనుకుంటాడు. వెన్నెల విందు, వన భోజనాలు నేను ఎప్పుడూ వెళ్లలేదు.. అంటూ వసుకు రిషి చెబుతాడు.
చెరువుగట్ల, తోటలు, ఆటపాటలు.. ఆ మెమోరీస్ వేరు అని వసు అంటుంది.. ఇంట్లో తినేది బయట తింటున్నాం.. అంతే కదా?.. అని రిషి అంటాడు. అలా అనకండి సర్. అందరం అలా బయటకు వెళ్లి పచ్చడన్నం తిన్నా కూడా బాగానే ఉంటుంది..అని అంటుంది. నీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది.. కదా? అని రిషి అంటాడు. లేదు.. సర్ నా దగ్గర సమాధానాలే ఉంటాయి.. ప్రశ్నలు తక్కువగా ఉంటాయి..అని వసు అంటుంది.
అలా కారులో వెళ్తుంటే. ఓ బుడ్డోడు వచ్చి అడుగా నిలుస్తాడు. వాడికి ఏమైందో అడిగి వెళ్దాం అని వసు అంటుంది. సరే ఇలా వదిలి వెళ్లడం కూడా కరెక్ట్ కాదు అంటాడు రిషి. ఇక గోలీల ఆటలో తనను మోసం చేశాడంటూ బుడ్డోడు చెప్పడం, వాడికి న్యాయం చేసేందుకు వసు నడుం బిగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో వసు గోలీలు ఆడేట్టు కనిపిస్తోంది. మొత్తానికి వసు, రిషిలు ఇలా ప్రయాణం చేయడంతో ఇ