- November 28, 2021
Bigg Boss 5 Telugu : తక్కువ అంచనా వేయోద్దు!.. సన్నీకి కౌశల్ మద్దతు
Kaushal Manda – VJ Sunny బిగ్ బాస్ ఐదో సీజన్ ఇప్పుడు చివరి దశకు వచ్చేస్తోంది. ఇంట్లో ఇప్పుడు కాజల్, సన్నీ, మానస్, ప్రియాంక, రవి, శ్రీరామచంద్ర, సిరి, షన్ను ఇలా ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ఈ రోజు రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తాడు. దీంతో ఇక ఏడు మంది ఉంటారు. ఉన్నది కూడా ఇక మూడు వారాలే. ఆల్రెడీ టాప్ 5 లిస్ట్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుంది.
నిన్న ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన వరుసలను చూస్తే టాప్ 5లో ఎవరెవరు ఉంటారో అందరికీ అర్థమైంది. సన్నీ, మానస్, షన్ను, శ్రీరామచంద్రలు టాప్ 5లో ఫిక్స్. ఇక సిరి, కాజల్ నుంచి ఎవరో ఒకరు టాప్ 5లోకి వస్తారు. ప్రియాంక వచ్చే వారం ఎలిమినేట్ అవుతుంది. అవతలి వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే విన్నర్ మాత్రం సన్నీ అనేది ఫిక్స్. రానున్న రోజుల్లో కాస్త అటూ ఇటూ అయితే మాత్రం సన్నీ కాస్త కిందకి వస్తాడేమో. కానీ ఇప్పుడు మాత్రం సన్నీ పీక్స్‌లో ఉన్నాడు. ఆ తరువాత షన్ను రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షన్నుకి ఉన్న గట్టి ఫ్యాన్ బేస్‌ను కూడా సన్నీ బద్దలు కొట్టేశాడు. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్నాడు.
ఇక ఇలాంటి సన్నీకి కౌశల్ మద్దతు లభించింది. తాజాగా కౌశల్ ఓ పోస్ట్ వేశాడు. బుల్లితెర తారలను తక్కువ అంచనా వేయకండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో సన్నీతో గతంలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. సన్నీతో పాటు మానస్, సిరిలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు కౌశల్. సన్నీ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అతనే విన్నర్ అవుతాడని క్లియర్‌గా హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది.