• November 27, 2021

Bigg Boss 5 Telugu : శ్రీరామచంద్రనే మానస్ అనుకో!.. ప్రియాంకను నాశనం చేస్తోన్న కాజల్

Bigg Boss 5 Telugu : శ్రీరామచంద్రనే మానస్ అనుకో!.. ప్రియాంకను నాశనం చేస్తోన్న కాజల్

    Bigg Boss 5 Telugu బిగ్ బాస్ టీవీల్లో వచ్చే ఎపిసోడ్ ఒకెత్తు అయితే అన్ సీన్‌లో వచ్చే కంటెంట్ ఒకెత్తు. ఒక్కోసారి ఎపిసోడ్ కంటే ఎక్కువగా అన్ సీన్‌లోనే మ్యాటర్ ఉంటుంది. అన్ సీన్‌లో ఎక్కువగా మానస్, ప్రియాంక.. షన్ను, సిరిల కంటెంట్ చూపిస్తారు. ఈ జంటల మధ్య గొడవలు, అలకలు, ప్రేమలు ఎక్కువగా చూపిస్తుంటారు. బిగ్ బాస్ ఇంట్లో మొత్తంగా కాజల్ మొదటి వాళ్లకు వీళ్లకు లింకులు పెట్టడం, బ్రోకరేజ్ పని చేస్తూనే వస్తుంది.

    ఈ మధ్య కాస్త తగ్గినట్టు అనిపించింది. మొదటి రెండు మూడు వారాల్లో మాత్రం కాజల్ పుటేజ్, కంటెంట్ కోసం నానా యాక్టింగ్‌లు చేసేది. అందరి వద్దకు వెళ్లి బ్రోకరేజ్ పనులు చేసింది. అయితే ఇప్పుడు ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ప్రియాంకకు కాజల్ చెప్పిన సలహాలు వింటే ఎవ్వరైనా సరే చెవులు, నోరు మూసుకోవాల్సిందే.

    మానస్ తనను పట్టించుకోవడం లేదని ఆ మధ్య ప్రియాంక ఏడ్చేసింది. ఇష్టపడితే ఇంత చీప్‌గా తీసిపడేయాలా? అంత చులకన అయిపోయానా? అంటూ ప్రియాంక కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రియాంక అలా బాధపడుతూ ఉంటే కాజల్ ఇచ్చిన సలహా మాత్రం కళ్లు తిరిగిపోయేలా ఉంది.

    మానస్ పట్టించుకోవడం లేదని ప్రియాంక బాధపడుతుంటే.. మానస్‌ను శ్రీరామచంద్రలో చూసుకో.. శ్రీరామచంద్ర అయితే ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు.. అతనితో ఉండు అన్నట్టుగా కాజల్ సలహా ఇస్తుంది. మొత్తానికి ప్రియాంక మైండ్‌లో లేనిపోనివి ఎక్కించేస్తోంది. ఇలాంటివి చూసినప్పుడే జనాలకు కాజల్ మీద ఇంకా విరక్తి పుడుతుంది.

    Leave a Reply