• November 26, 2021

Arrangements of Love : ఇంటర్నేషనల్ లెవెల్.. బైసెక్సువల్‌‌గా సమంత!

Arrangements of Love : ఇంటర్నేషనల్ లెవెల్.. బైసెక్సువల్‌‌గా సమంత!

    Arrangements of Love సమంత ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. సమంత ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కాదు. ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదగనుంది. తాజాగా ఓ అంతర్జాతీ ప్రాజెక్ట్ కోసం సమంత సైన్ చేసిందట. ఓ బేబీ నిర్మాత ఈ చిత్రాన్ని సునీత తాటి నిర్మిస్తోందట. బాఫ్టా అవార్డు సొంతం చేసుకున్న ఫిలిఫ్ జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఆయన ఇది వరకు డౌన్‌టన్ అబ్బే, ది గుడ్ కర్మ హాస్పిటల్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

    2004లో వచ్చిన అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారట. ఇందులో సమంత ఓ బైసెక్సువల్‌గా నటిస్తుందట. తమిళ అమ్మాయి, సంప్రదాయబద్దంగా పెంచిన కుటుంబం, కానీ తన స్వతంత్ర ఆలోచనలతో పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఒత్తిడి ఉంటుందట. కానీ సమంత పాత్ర మాత్రం తన సొంత ఆలోచనలతో జీవితాన్నిఎంచుకుంటుందట.

    మొత్తానికి ఈ పాత్ర ఎంతో చాలెంజింగ్ అని, ఇందులో నటించడం సవాల్‌తో కూడుకున్న పని సమంత చెప్పుకొచ్చింది. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన సినిమా విశేషాలను పంచుకుంది. ఓ బేబీ తరువాత మళ్లీ సునీతతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత లెవెల్ మాత్రం దినదినం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ చిత్రంలోనే నటించేస్తోంది.

    Leave a Reply