• November 23, 2021

పెళ్లికి ముందు పెళ్లికి తరువాత సమంత అలా.. నిహారిక కామెంట్స్ వైరల్

పెళ్లికి ముందు పెళ్లికి తరువాత సమంత అలా.. నిహారిక కామెంట్స్ వైరల్

    నిహారికి సినిమా ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో అందరికీ తెలిసిందే. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలిపోయాయి. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో వెండితెరకు దూరంగా ఉండిపోయింది నిహారిక. కానీ ఓటీటీ కంటెంట్లు, వెబ్ సిరీస్‌లతో మాత్రం నిహారిక తన మార్క్ చూపించింది. అయితే పెళ్లి చేసుకున్న నిహారిక.. ఇంకా సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగానే ఉంటుంది.

    పెళ్లి అయిన తరువాత నిహారిక మంచి ఫాంలోకి వచ్చింది. వరుసగా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తోంది. అయితే తాజాగా నిహారిక ఓ టాక్ షోలో పాల్గొంది. ఆలీతో సరదాగా షోలో నిహారిక గెస్టుగా వచ్చింది. ఎన్నో విషయాల మీద క్లారిటీ ఇచ్చింది. పెళ్లికి, సినిమా కెరీర్‌కు సంబంధం ఏమీ ఉండదని నిహారిక అంది. పెళ్లికి ముందు సమంతకు క్రేజ్ ఉంది.. పెళ్లి తరువాత కూడా క్రేజ్ ఉంది. ఇంకా ఎక్కువ అయింది.. అలా పెళ్లి అయితే క్రేజ్ తగ్గుతుందని చెప్పలేం.

    ఒక్కొక్కరు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. వ్యక్తిగత కారణాల వల్ల కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అది వాళ్ల నిర్ణయాలు మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను సినిమాల్లో చేయడం మా ఆయనకు ఇష్టం అందుకే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను నటిస్తున్నానా? నిర్మిస్తున్నానా? అని కాకుండా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నానా? లేదా? అని మాత్రమే చూస్తున్నాను అని నిహారిక చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇకపై కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని నిహారిక చెప్పకనే చెప్పేసింది.

    Leave a Reply