• November 22, 2021

Bigg Boss 5 Telugu : నోరు జారాడు, వెనక్కి తగ్గాడు!.. సన్నీ కాజల్‌ ఫ్యామిలీకి సుదర్శన్ క్షమాపణలు

Bigg Boss 5 Telugu : నోరు జారాడు, వెనక్కి తగ్గాడు!.. సన్నీ కాజల్‌ ఫ్యామిలీకి సుదర్శన్ క్షమాపణలు

    బిగ్ బాస్ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రిలేషన్‌ను మెయింటైన్ చేస్తుంటారు. అయితే సన్నీ, కాజల్ బ్రదర్ అండ్ సిస్టర్ అనే రిలేషన్‌లే దగ్గరగా ఉన్నారు. కానీ కమెడియన్ సుదర్శన మాత్రం కొత్త ట్రాక్ కనిపెట్టాడు. తన కళ్లకు అలా ఎందుకు కనిపించిందో తెలీదు కానీ.. మీ రొమాన్స్ బాగుంటుంది.. మీకు జోడి దొరికిందంటూ కాస్త హద్దులు దాటేశాడు. మాది రొమాన్సా? అని కాజల్, సన్నీలు షాక్ అయ్యారు. ఆ టాస్క్‌‌లో భాగంగా సన్నీ కాజల్ డ్యాన్సులు కూడా వేశారు.

    ఆ తరువాత రిలేషన్ మీద నాగార్జున కూడా క్లారిటీ ఇప్పించాడు. అక్కా తమ్ముళ్లా? అన్నా చెల్లెళ్లా? అని అడిగేశాడు. భూమి పుట్టినప్పుడు పుట్టింది సర్.. అక్కా తమ్ముళ్లమే అని సన్నీ క్లారిటీ ఇచ్చాడు. ఇక సుదర్శన్ అన్న మాటలకు అక్కడే క్లారిటీ ఇప్పించేశాడు నాగ్. కానీ సన్నీ ఫ్యాన్స్ మాత్రం సుదర్శన్‌ను టార్గెట్ చేశారు. సుదర్శన్ మీద నానా రకాల కామెంట్లతో దాడి చేస్తున్నారు. దీంతో దెబ్బకు దిగొచ్చేశాడు కమెడియన్ సుదర్శన్.

    జస్ట్ నేను కామెడీగానే అన్నాను.. బయటకు వచ్చిన వీడియో వల్ల అది నెగిటివ్‌గానే అనుకుంటున్నారు.. ఫాదర్ అండ్ డాటర్ నుంచి.. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ వరకు వచ్చామని అన్నారు.. మేం అక్కడ చాలా సేపు మాట్లాడుకున్నాం.. కానీ బయటకు వచ్చిన వీడియో వల్ల నెగటెవ్ అనిపిస్తుంది. అది నేను ఎంతో సరదాగానే అన్నాను. సన్నీ కోపం గురించి ఫన్నీగా మాట్లాడాను. కాజల్ సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడాలని అనుకోలేదు.. నాకు వేరే ఉద్దేశం లేదు. జరిగిన తప్పుపై సన్నీ ఫ్యాన్స్‌కి అలాగే.. కాజల్‌ని ఫ్యామిలీకి క్షమాపణ చెప్తున్నాను అని సుదర్శన్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

    మొత్తానికి సుదర్శన్ పెట్టిన మంటలు బాగానే చెలరేగాయి. కాజల్, సన్నీ గురించి తప్పుగానే అన్నా కూడా.. సిరి, షన్నులకు మాత్రం షాక్ ఇచ్చాడు. బయట ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండి అని దీప్తి సునయన, శ్రీ హాన్‌లను పరోక్షంగా గుర్తు చేశాడు.

    Leave a Reply