• November 19, 2021

Eyy Bidda Idhi Naa Adda : ఆయన పనులకు షాక్ అవుతా.. బన్నీపై రష్మిక మందన్నా

Eyy Bidda Idhi Naa Adda : ఆయన పనులకు షాక్ అవుతా.. బన్నీపై రష్మిక మందన్నా

    రష్మిక మందన్నా లౌక్యం తెలిసిన హీరోయిన్. ఏ హీరోతో పని చేస్తే ఆ హీరో గురించి ప్రశంసల వర్షం కురిపిస్తుంటుంది. అలాంటి రష్మిక ఇప్పుడు బన్నీతో కలిసి పని చేస్తోంది. బన్నీ, రష్మిక, సుకుమార్ కలిసి చేస్తోన్న మ్యాజిక్ పుష్ప. ఇప్పటికే ఈ సినిమాను నుంచి వదిలిన పోస్టర్లు, కంటెంట్ అన్నీ కూడా హైలో ఉన్నాయి. పాటలు ఒక్కొక్కటిగా మార్మోగిపోతూనే ఉన్నాయి. అలాంటి సినిమా నుంచి తాజాగా మరో ఊర మాస్ పాట వచ్చింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ దుమ్ములేపేశాడు.

    దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు బిడ్డా అడ్డా అంటూ దుమ్ములేపేందుకు వచ్చాడు. అయితే ఈ మధ్య ఓ పిక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేస్తున్నారని ఓ పిక్ వైరల్ అయింది. ఆ పిక్ ఈ సాంగ్ షూట్‌లోనిదేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన రషెస్ చూసిందట రష్మిక మందాన్న. దానిపై ఈ బ్యూటీ కామెంట్ చేసింది.

    తాజాగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ పాట బయటకు వచ్చింది. ఇందులో బన్నీ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. దీనిపై రష్మిక స్పందించింది. కొన్ని రషెష్ చూశాను.. నా మైండ్ బ్లాక్ అయిపోయింది.. ఆయన చేసే ప్రతీ పనితో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు.. ఈ పాటను థియేటర్లో చూసినప్పుడు మీరు కచ్చితంగా మెంటలెక్కిపోతారు.. అంత వరకు ఇది చూడండి.. మాస్‌కు నెక్ట్స్ లెవెల్ అంటూ బన్నీ మీద ప్రశంసలు కురిపించింది.

    Leave a Reply