తిరుపతి, తిరుమల ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి కురుస్తున్న వానలతో ఘాటు రోడ్డును సైతం దెబ్బ తింది. కొండచరియలు విరిగిపడుతన్నాయి. దీంతో తిరుమలకు రాకపోకలు మూసివేశారు. అక్కడున్న పరిస్థితులను ప్రతీక్షణం ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ఈ వరదలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చిరంజీవి స్పందించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు, తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభత్వుం, టీటీడీ కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు చేయూతనివ్వాలని చిరంజీవి కోరారు.
ఇక బండ్ల గణేష్ సైతం తిరుమల పరిస్థితిపై స్పందించాడు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేయగలిగిన ప్రతీ సాయం, చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, అన్ని రాజకీయ పార్టీలను, అభిమాన సంఘాలను బండ్ల గణేష్ కోరాడు.