• November 16, 2021

మాతృత్వం గొప్ప వరం!.. కూతురి ఫోటోలను షేర్ చేసిన చైత్రా రాయ్

మాతృత్వం గొప్ప వరం!.. కూతురి ఫోటోలను షేర్ చేసిన చైత్రా రాయ్

    బుల్లితెరపై నటి చైత్రా రాయ్ ప్రయాణం చాలా సుధీర్ఘమైంది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్ని చానెళ్లలో చాలా సీరియల్స్ చేసింది. కన్నడ, తెలుగు ప్రేక్షకులకు చైత్రా రాయ్ సుపరిచితురాలు. కన్నడ నటి అయినా కూడా తెలుగు సీరియళ్లతో ఇక్కడి వారికి దగ్గరైంది. ఒకరికి ఒకరు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు ఇలా ఎన్నెన్నో సీరియల్స్‌తో చైత్రా రాయ్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ప్రస్తుతం చైత్రా రాయ్ తన కెరీర్ కాస్త విరామం ఇచ్చింది.

    కెరీర్‌ను పక్కనపెట్టేసి.. ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని ఇచ్చింది. కెరీర్ ఎప్పుడైనా మళ్లీ గాడిన పెట్టుకోవచ్చు.. కానీ ఈ సమయం మాత్రం మళ్లీ రాదు.. మాతృత్వం కంటే ఏదీ గొప్పది కాదు.. అందుకే కెరీర్‌ను పక్కన పెట్టి తల్లిగా మారాను అని చైత్రా రాయ్ ఆ మద్య ఎమోషనల్ అయింది. కుటుంబాన్ని చూసుకోవడం, తల్లిగా మారడం వంటి అనుభూతులను చెబితే అర్థం కాదు అనుభవిస్తేనే తెలుస్తుందంటూ చైత్రా రాయ్ వరుసగా ఆ మధ్యపోస్ట్‌లుపెట్టింది.

    తాజాగా తన కూతురి ఫోటోలను షేర్ చేస్తూ చైత్ర రాయ్ తెగ మురిసిపోయింది. ఆగస్ట్ 16న నేను తల్లిని అయ్యాను. ఇంతలా నేను ఇది వరకు ఎవ్వరినీ ప్రేమించలేదు. నేను తల్లిని కావడం ఎంతో ఆనందంగా ఉంది.. నిజంగానే మాతృత్వం అనేది ఓ వరం.. మ ప్రేమకు సాక్ష్యం అయిన నిష్క శెట్టిని చూడండి.. ఆమె ఫోటో షూట్‌ను ఇంత అందంగా చేసిన హ్యాపెనింగ్ పిక్సల్‌కు థ్యాంక్స్. ఇది ఆమె పదిహేను రోజుల పసికందుగా ఉన్నప్పుడు తీసిన ఫోటో షూట్.. అంటూ చైత్రా రాయ్ తెగ మురిసిపోయింది. తన కూతురి పేరిట కూడా ఓ ఇన్ స్టాగ్రాం అకౌంట్‌ను తెరిచింది.

    Leave a Reply