• November 14, 2021

Bigg Boss 5 Telugu : సన్నీ మరో కౌశల్ అవుతాడా?.. కంటెస్టెంట్లే కాక హోస్ట్ కూడా అంతే

Bigg Boss 5 Telugu : సన్నీ మరో కౌశల్ అవుతాడా?.. కంటెస్టెంట్లే కాక హోస్ట్ కూడా అంతే

    బిగ్ బాస్ ఇంట్లో సన్నిది కాస్త టిపికల్ మైండ్ సెట్. టాస్కులో ఉన్నంత వరకు ఎంతో జాలీగా ఉంటాడు. ఆడే వరకు ఆటలు బాగా ఆడతాడు. అందరినీ నవ్విస్తాడు. అందరితో కలిసేందుకు ట్రై చేస్తాడు. ఇక సన్నీకి ఆవేశం ఎక్కువ.. కంట్రోల్ చేసుకోలేడు అని అందరికీ తెలిసిందే. దీన్ని అందరూ అలుసుగా తీసుకుంటున్నారు. అయితే కొంచెం కదిలిస్తే.. సన్నీ రెచ్చిపోతాడని, మాటలు అనేస్తాడని అందరికీ తెలుసు. కాబట్టే వేడిలో ఉన్న సన్నిని ఇంకా రెచ్చగొడుతుంటారు. అలా సన్నీని సిరి, షన్నులు రెచ్చగొట్టడంతోనే అలా జరిగింది.

    సన్ని కొన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. కానీ సన్నీని ఇంకా ఇంకా రెచ్చగొట్టింది మాత్రం సిరినే. అయితే హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇరు పక్షాల వాదనను వినాల్సింది. కానీ ఏకపక్షంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. సన్నీని కూడా ఎన్నెన్నో మాటలు అనేశారు. కానీ సన్నీ కోణంలోంచి చూడలేకపోయాడు నాగ్. సన్నీ చెప్పేదాన్ని వినను కూడా వినలేదు. తాను తంతా అన్నది బ్రిక్స్‌ను, సిరిని కాదు అని చెప్పినా కూడా వినడం లేదు. సిరిని తంతా అన్నావ్.. ఆ తరువాత తెలివిగా బ్రిక్స్ అని చెప్పేశావ్ అని నాగ్ అంటున్నాడు.

    అది తన ఉద్దేశ్యం కాదని చెప్పినా నాగ్ వినడం లేదు. కాజల్, ఆనీలు కూడా సన్నీ ఉద్దేశ్యం అది కాదనే అంటున్నారు. సన్నీ ఎంత చెప్పినా వినడం లేదు. మొత్తానికి సన్నీని అందరూ కలిసి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. చివరకు నాగ్ కూడా అంతే ప్రవర్తించాడు. సన్నీని లోపల అయితే కార్నర్ చేశారు. కానీ బయట మాత్రం భారీగానే మద్దతు లభిస్తోంది. అయితే సన్నీ కూడా తాను అన్న మాటలు అనలేదు అని చెప్పడం, వీడియో చూపించినా కూడా మళ్లీ మరిచిపోవడం, అనలేదు అని చెప్పడం ఇలా కొన్ని మాటలు మార్చడంతో కాస్త నెగెటివిటీ వచ్చేస్తుంది. సన్నీ గనుక ఆ ఆవేశాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే మాత్రం తిరుగుండదు.

    రెండో సీజన్‌లో కూడా అంతే.. ప్రతీసారి, ప్రతీ విషయంలో  కౌశల్‌ను కార్నర్ చేసేవారు. ప్రతీది తప్పు అంటూ అందరూ వేలెత్తి చూపేవారు. అంతా ఒక్కటై కౌశల్‌ను తప్పుబట్టేవారు. కానీ చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మరి సన్నీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply