• November 11, 2021

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. అలా మిస్ అయిందన్న శ్రీనువైట్ల

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. అలా మిస్ అయిందన్న శ్రీనువైట్ల

    టాలీవుడ్‌లో ప్రతీ ఒక్క డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చేత తమ డైలాగ్‌లు పలికించాలని చాలా మంది దర్శకులకు ఉంటుంది. అలానే శ్రీను వైట్లకు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని చాలానే ప్రయత్నించాడట. కానీ అది కుదరలేదట. ఓ రెండు మూడు సార్లు కలిశాడట. కానీ సరైన కథ వినిపించకపోవడంతో చాన్స్ మిస్ అయిందంటూ తాజాగా శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దాదాపు హిట్లే ఇచ్చాడు.

    కుర్ర హీరోలకు శ్రీను వైట్ల మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. ఢీ, రెడీ వంటి సినిమాలతో ఓ మార్క్ క్రియేట్ చేశాడు శ్రీను వైట్ల. వెంకీ, దుబాయ్ శ్రీను ఇలా కామెడీ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు తీశాడు. చివరకు దూకుడు అంటూ మహేష్ బాబుకు మరో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అలాంటి శ్రీను వైట్లకు పవన్ కళ్యాణ్‌తో చేయాలనే కోరిక ఉందట. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తాను సూట్ అవుతాను అని తనకెంతో నమ్మకం అట. ఆయన్ను ఇంకా బాగా హ్యాండిల్ చేయగలను అని అనుకున్నాడట.

    అలా రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్‌ను కలిశాను అని చెప్పాడు. కానీ కథ సెట్ అవ్వకపోవడంతో కాంబినేషన్ మిస్ అయిందని అన్నాడు. ఇక బాలయ్య బాబుతో ఓ మంచి ఎంటర్టైనర్ తీయాలని ఉందట. అందరూ చూపించే విధంగా కాకుండా.. మంచి మాస్ ఎంటర్టైనర్ తీయాలని ఉందట. మొత్తానికి ఇప్పుడు రెండు మూడు స్క్రిప్ట్‌లు చేతిలో ఉన్నాయట. మొదటగా మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డీ అండ్ డీ డబుల్ డోస్ అనే సినిమా పనిలో బిజీగా ఉన్నాడట.

    Leave a Reply