- November 9, 2021
ప్రైవేట్ హోటల్లో విజయ్.. పక్కలో ఎవరున్నారంటే?.. బెడ్రూం వీడియో వైరల్

విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. ఓ వైపు సినిమాలో నటిస్తూ.. మరో వైపు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇవి కాకుండా బిజినెస్‌ల్లోనూ దిగేశాడు. ఇంత వరకు బట్టల వ్యాపారం మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ కట్టి.. థియేటర్ బిజినెస్‌లోకి కూడా దూకేశాడు. అలా విజయ్ దేవరకొండ మంచి స్పీడు మీదున్నాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ హిట్ కొట్టేయడంతో కాస్త కాన్ఫిడెంట్ వచ్చినట్టుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో ఆనంద్ సక్సెస్ కొట్టేశాడు.
ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం అంటూ రాబోతోన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలు పెంచేశాడు. తమ్ముడి కోసం ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ నిర్మించాడు. ఇక ప్రమోషన్స్ బాధ్యతలను విజయ్ తన భుజాన వేసుకున్నాడు. అందుకే అంతా తానై ముందుండి నడిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ పేరే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ చూస్తే ఇదొక కొత్త కాన్సెప్ట్ అని అందరికీ అర్థమవుతుంది.
పెళ్లైన వారానికే పెళ్లాం లేచిపోతే.. వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతో ఫన్నీగా చూపించాడు. దీంతో పాటు ఏదో ఒక అంతర్లీనంగా కాన్సెప్ట్ ఉందని చెప్పకనే చెప్పేశారు. ఇక సుందర్ భార్య ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే అనుమానం అందరిలోనూ కలిగింది.తాజాగా విజయ్ వైజాగ్ ఈవెంట్ కోసం వెళ్లిన నాటి వీడియోను షేర్ చేసింది. హోటల్ బెడ్రూంలో తన పక్కన ఎవరు పడుకున్నారో తెలుసా? అంటూ ఆనంద్ దేవరకొండను చూపించాడు.
Guess who is sharing the bed with me today 😉
Book your tickets now – https://t.co/0neeFHptsf pic.twitter.com/qQrDTt5dSr
— Vijay Deverakonda (@TheDeverakonda) November 9, 2021
ఏయ్ సుందర్ నీ పెళ్లాం ఎక్కడికి పోయిందంటూ నానా హంగామా చేశాడు. అలా ఉదయాన్నే విసిగిస్తుండటంతో.. ఆనంద్ నిద్రలోంచి.. ఏ ఊకోరా అని కసురుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అన్నాదమ్ములిద్దరూ కూడా సినిమాగాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. మరి వారి భవిష్యత్తు ఈ శుక్రవారం తేలనుంది.