• November 6, 2021

Bigg Boss 5 Telugu : అమ్మాయిలు సేఫ్.. ఎలిమినేట్ అయింది అతడే!

Bigg Boss 5 Telugu : అమ్మాయిలు సేఫ్.. ఎలిమినేట్ అయింది అతడే!

    బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ సమయానికి ఆసన్నమైంది. ఆల్రెడీ ఓట్లు పడ్డాయి. వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. ఆదివారం నాడు ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. కానీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు మాత్రం శనివారమే బయటకు వస్తుంది. అదే మ్యాజిక్కు. లీకు వీరులు శనివారం సాయంత్రానికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల పేరును బయటపెట్టేస్తారు. ఇలాంటి లీకులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు చక్కర్లు కొడుతుంది.

    అసలే ఈ వారం షన్ను, ఆనీ మాస్టర్, మానస్ తప్ప మిగిలిన అందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు. అది కూడా మొదట కెప్టెన్ షన్ను తప్పా అందరూ నామినేషన్లోకి వచ్చారు. ఆ తరువాత టాస్కులో గెలిచి ఆనీ మాస్టర్ నామినేషన్ నుంచి తప్పించుకుంది. తనకు ఏడో వారాంతంలో వచ్చిన పవర్ ద్వారా మానస్‌ను నామినేషన్ నుంచి సేఫ్ చేసింది. అలా ముగ్గురు నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన ఎనిమిది మంది నామినేషన్లోకి వచ్చారు.

    సిరి, జెస్సీ, కాజల్, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, విశ్వ, ప్రియాంక సింగ్‌లోంచి ఒకరు ఈ వారం బయటకు వెళ్లాల్సిందే. ఆ కంటెస్టెంట్ ఎవరో కూడా లీకైంది. విశ్వ ఎలిమినేట్ లీకులు వస్తున్నాయి. ఈ మేరకు నెట్టింట్లో విశ్వ పేరు మార్మోగిపోతోంది. ప్రతీ వారం అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే ఈ సారి మాత్రం విశ్వ బయటకు వచ్చాడు. దీంతో ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా.. అందులో నటరాజ్ మాస్టర్, విశ్వ, లోబోలు మగ కంటెస్టెంట్లు. మిగతా ఆరు మంది అమ్మాయిలే. సరయు, ఉమాదేవీ, లహరి, హమీద, శ్వేత, ప్రియలు ఇలా వరుసగా ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతూ వచ్చారు.

    Leave a Reply