• November 6, 2021

Bigg Boss 5 Telugu : చటుక్కున ముద్దుపెట్టిన జెస్సీ.. ఖంగుతిన్న ప్రియాంక

Bigg Boss 5 Telugu : చటుక్కున ముద్దుపెట్టిన జెస్సీ.. ఖంగుతిన్న ప్రియాంక

    బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక సింగ్ తీరే వేరు. అసలు ఆమె మనసులో ఏముంది.. ఆమె చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. జెస్సీ, శ్రీరామ, మానస్ అంటూ ఇలా ట్రాకులు నడిపిస్తూ ఉంది.అందులో ఎక్కువగా మానస్‌తో క్లోజ్‌గా ఉంటుంది. ఆ ముగ్గురూ బావలే అని అంటుంది. అయితే మానస్ మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. ఈ మధ్య శ్రీరామచంద్రతో కాస్త దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక జెస్సీతో అయితే జోకులు చేస్తుంటుంది.

    బెడ్డు మీదే కాళ్లు, చేతులు వేసి పడుకుంటుంది. మొన్న జెస్సీ ఆరోగ్యం బాగా లేక బెడ్డు మీద పడుకుంటే.. ఓ వైపు సిరి, మరో వైపు ప్రియాంక పడుకుంది. ముద్దు పెట్టండి అని జెస్సీ అడిగేశాడు. సుఖ పరుషుడివి అంటూ జెస్సీ మీద ప్రియాంక కొంటె కామెంట్లు చేసింది. ఈ వారం సూపర్ హీరోస్ సూపర్ విలన్స్ టాస్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చివరకు విలన్స్ టీం నెగ్గింది. విలన్ టీంలో ఆనీ, రవి, విశ్వ, సన్నీ, జెస్సీ, సిరి ఉన్నారు.

    అయితే విలన్స్ టీం గెలిచిందని బిగ్ బాస్ ప్రకటించడంతో ఆ టీం మెంబర్స్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. జెస్సీ అలానే లివింగ్ ఏరియాలోని సోఫా మీద కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రియాంక అతని వద్దకు వెళ్ళి కంగ్రాట్స్ చెప్పింది. అలా చెప్పడంతో వెంటనే ప్రియాంకకు ముద్దు పెట్టేశాడట. అలా సడెన్‌గా ముద్దు పెట్టడంతో ప్రియాంక షాక్ అయింది. వాడు అలా కూర్చున్నాను.. కంగ్రాట్స్ చెప్పాను.. చటుక్కున ముద్దు పెట్టేశాడంటూ అందరికీ చెప్పేసింది.

     

    Leave a Reply