Puneeth Rajkumar కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) కాసేపటి క్రితమే మరణించారు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తతో టాలీవుడ్ కోలీవుడ్ శాండల్ వుడ్ సెలెబ్రిటీలంతా కూడా దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
‘గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది.. కుప్పకూలిపోయినట్టు అనిపిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఎంతో త్వరగా వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతికలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కన్నడ ఇండస్ట్రీకే కాకుండా ఇండియన్ సినీ కుటుంబానికి తీరిని లోటు’ అని చిరు ఎమోషనల్ అయ్యాడు.
‘నా ప్రియమైన సోదరుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఎంతో మంచి వారు. ఆయన తండ్రి రాజ్ కుమార్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన నటన, మంచితనంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢా సానుభూతి’ అని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.
పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను. ఎంతో దుఖాన్ని అనుభవించాను. నేను కలిసి వారిలోకెల్లా ఎంతో సౌమ్యుడు. ఎంతో ఒదిగి ఉండే మనుషి. ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ని మహేష్ బాబు ట్వీట్ వేశారు.
కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢా సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ వార్త విన్న వెంటనే షాక్ అయ్యాను. నా గుండె ముక్కలైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని నాగార్జున ట్వీట్ వేశాడు. ఇక ఎన్టీఆర్ అయితే హృదయం బద్దలైందంటూ.. నమ్మలేకపోతోన్నానంటూ ఎమోషనల్ అయ్యాడు