Samantha: బయటకు వెళ్లినందుకు సంతోషంగా ఉంది!.. సమంతపై మంచు లక్ష్మీ వింత కామెంట్లు

Samantha: బయటకు వెళ్లినందుకు సంతోషంగా ఉంది!.. సమంతపై మంచు లక్ష్మీ వింత కామెంట్లు

    Samantha సమంత విడాకుల విషయం ఇప్పుడు పక్కకు జరిగింది. సమంత విడాకుల చుట్టూ వచ్చిన కథనాలు, రూమర్లు సైతం తగ్గాయి. తన మీద అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్ చానెళ్ల మీద సమంత కేసులు వేయడం సంచలనంగా మారింది. మొత్తానికి ఆ కేసులో సమంతకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇకపై సమంతకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు రాయోద్దంటూ యూట్యూబ్ చానెళ్లకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి సమంత అలా కోర్టు కేసు కూడా హాట్ టాపిక్ అయింది.

    సమంత మొత్తానికి ఈ గ్యాప్‌లో తీర్థయాత్రలు కూడా చేసింది. ఛార్ ధామ్ యాత్రలో సమంత ఎన్నో విషయాలు తెలుసుకుంది. మొత్తంగా ఆ యాత్రను సమంత సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది. అయితే తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది. అందులో పెయింటింగ్ వేస్తున్నట్టుగా ఉన్న సమంత కనిపిస్తోంది. ఎంతో సంతోషంగా తన ఆనందాన్ని మొత్తం వ్యక్తం పరిచేలా ఆ ఫోటోలో సమంత నవ్వులు చిందిస్తోంది. లోపల ఉన్న మనలోని మనిషి.. నువ్ పెయింటింట్ వేయలేవ్ అని అంటే.. వెంటనే పెయింటింగ్ వేసేయాలి.. అప్పుడు అది నోరు మూసుకుంటుంది అని చెప్పుకొచ్చింది.

    కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడ్డ వారికి నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారట. ఆర్ట్ ద్వారా ఆశలను రేకెత్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమట. అయితే సమంత ఇందులో ఓ చేయి వేసింది. అయితే ఆ పోస్ట్‌కు మంచు లక్ష్మీ వింత కామెంట్లు పెట్టేసింది. నువ్ అలా బయటకు వెళ్లడం, సరదాగా ఉండటం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది బేబీ అంటూ కామెంట్ చేసింది. అంటే సమంత పర్సనల్ లైఫ్‌లో ఇంతకు ముందు చాలా బాధలు పడిందా? అని అనుమానాలు రేకెత్తించేలా మంచు లక్ష్మీ కామెంట్ కనిపిస్తోంది.

    Leave a Reply