• October 26, 2021

ఉండేది 30 రోజులు అందులో సగం సెలవులే!.. నవంబర్‌లో బ్యాంకుల హాలీడే లిస్ట్

ఉండేది 30 రోజులు అందులో సగం సెలవులే!.. నవంబర్‌లో బ్యాంకుల హాలీడే లిస్ట్

    సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుంచి వాస్తవాలు, అవాస్తవాలకు తేడా తెలియకుండా పోయింది. నిజాన్ని చెప్పే సమాచారం కంటే తప్పుడు వార్తలే వేగంగా వెళ్తున్నాయి. వాటినే ప్రజలు నమ్ముతున్నారు కూడా. అలా తాజాగా ఓ రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నవంబర్ నెలలో బ్యాంకులు దాదాపు 17 రోజులు పని చేయవు. వాటికి సెలవులు అని ఓ కథనం చెక్కర్లు కొడుతున్నాయి. కానీ అసలు కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    17 రోజులు బ్యాంకులకు సెలవు అంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. కానీ అది అన్ని రాష్ట్రాలకు వర్తించదు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అది కుదరదు. కన్నడలో రాజ్యోత్సవం, ఛత్ పూజా వంటివి ఉంటాయి. అందుకే అలా 17 రోజులు పని చేయవు. అందుకే అలాంటి ప్రచారం జరుగుతోందట. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సాధారణ సెలవులు అంటే శని, ఆదివారాలు.. దీపావళి, గురు నానక్ జయంతి వంటి వాటిని కలుపుకుంటే మొత్తంగా 8 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయవు.

    * నవంబర్‌ 4 – దీపావళి (గురువారం)

    * నవంబర్‌ 7 – (ఆదివారం)

    * నవంబర్‌ 13 – (రెండో శనివారం)

    * నవంబర్‌ 14 – (ఆదివారం)

    * నవంబర్‌ 19 – గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)

    * నవంబర్‌ 21 – (ఆదివారం)

    * నవంబర్‌ 27 – (నాలుగో శనివారం)

    * నవంబర్‌ 28 – (ఆదివారం)

    Leave a Reply