• October 26, 2021

Bigg Boss 5 Telugu : నేను కనలేదు కానీ నాకు పాప ఉంది.. అసలు గుట్టు విప్పేసిన సిరి

Bigg Boss 5 Telugu : నేను కనలేదు కానీ నాకు పాప ఉంది.. అసలు గుట్టు విప్పేసిన సిరి

    సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో చిచ్చర పిడుగులా దూసుకుపోతోంది. తన అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే బిగ్ బాస్ ఇంట్లో అప్పుడప్పుడు సిరి ఎమోషనల్ అవుతుంటుంది. ఆమె జీవితంలోని ఎన్నో సంఘటనల గురించి చెప్పేసింది. మొదటి ప్రేమ, బ్రేకప్, మళ్లీ కలవడం, అతను చనిపోవడం వంటి విషయాలు చెప్పి అందరినీ ఎమోషనల్ చేసింది. అయితే
    సిరి మళ్లీ ప్రేమలో పడింది.. పెళ్లి కూడా చేసుకుంది.

    అయితే సిరికి పెళ్లికాకుండా పాప ఉందనే వార్తలు బయటకు వచ్చాయి. దానిపై సిరి తాజాగా క్లారిటీ ఇచ్చింది. నిన్నటి టాస్క్‌లో సిరి అసలు సంగతి చెప్పింది. నిన్న నామినేషన్ ప్రక్రియలో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి నుంచి లేఖలు రావడం, వాటిని అందుకున్న వారు నామినేషన్ నుంచితప్పించుకుంటారు. లేఖలు చేతికి రాని వారు నామినేట్ అవుతుంటారు. అలా విశ్వ, సిరి లేఖలు ఒకేసారి వచ్చాయి. అందులో ఎవరో ఒకరు లేఖను చించాల్సి వచ్చింది.

    విశ్వ తన కొడుకు పేరు చెప్పడంతో సిరి ఎమోషనల్ అయింది. నాకు ఆ బాధ తెలుసు.. నేను కనకపోయినా.. నాకు ఓ పాప ఉంది.. ఆ బాధ ఏంటో నాకుతెలుసు..విశ్వనే ఆ లెటర్ తీసుకోమ్మను. ఆయన కొడుకు రాశాడు కదా? అని సిరి త్యాగం చేసింది. మాటలు అయితే అందిగానీ.. సిరి మాత్రం తెగ ఏడ్చేసింది. తాను బిడ్డను కనకపోయినా కూడా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పేసింది. ఇక విశ్వ తన కొడుకు రాసిన లెటర్ చదువుకుని ఎమోషనల్ అయ్యాడు.

    Leave a Reply