- October 25, 2021
Anchor Vishnu Priya: రోజులో 16 నుంచి 20 గంటలు అదే చేస్తా : యాంకర్ విష్ణు ప్రియ

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేసే స్థాయి నుంచి ఓటీటీ, సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. బుల్లితెరపై విష్ణుప్రియకు వచ్చిన ఇమేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. పోవే పోరా అనే షో విష్ణుప్రియను ఎంతలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోయిన్ అవ్వాలి లేదా యాంకర్‌గా మారి వారిని ఇంటర్వ్యూలు చేయాలనే కలలు కంటూ వచ్చిందట.
మొత్తానికి విష్ణుప్రియ కలలు కన్నట్టుగానే యాంకర్ అయింది.. హీరోయిన్‌గానూ ఎదిగింది. అయితే ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం కాస్త స్పీడును తగ్గించేసింది. బుల్లితెరపై ఎలాంటి షోలు చేయడం లేదు. ఏదో స్పెషల్ ఈవెంట్, స్పెషల్ షో ఉందని పిలిస్తే అలా వెళ్తోందని, డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసి వస్తోంది. అంతేగానీ ఏదో ఒక షోకు యాంకరింగ్, హోస్టింగ్ వంటివి చేయడం లేదు.

ఇప్పుడు తన మనసు అంతా కూడా దైవ చింతన మీద, సేవా దృక్పథం మీదకు మళ్లిందని ఆ మధ్య ఓ వీడియోలో పేర్కొంది. రుద్ర ఫౌండేషన్‌ను స్థాపించానని దాంతో కొంత మందికి సాయం చేస్తున్నాను అని తెలిపింది. అయితే విష్ణుప్రియ ఈ మధ్య తన ఫిట్ నెస్ మీద ఎంతగా దృష్టి పెట్టిందో ఆమెను ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది.
నిత్యం వర్కవుట్లు, జంపింగ్‌లు, బాక్సింగ్‌లు, ఫీట్లు చేస్తుంటుంది. జిమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ తాజాగా దానికి విరుద్దమైన కామెంట్లు చేసింది. సర్వేల ప్రకారం సింహం ఒక రోజులో దాదాపు 16 నుంచి 20 గంటల వరకు విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం వంటివే చేస్తుందట. అయితే తాను కూడా సింహాన్నే అని చెప్పుకొచ్చింది. అంటే తాను కూడా 16 నుంచి 20 గంటలు విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడమే చేస్తానని పరోక్షంగా చెప్పేసింది.